Mother | కన్నతల్లే తన కొడుకు పాలిట యమపాశంలా మారింది. రోజూ ఏడుస్తూ తనను విసిగిస్తున్నాడని ఓ తల్లి తన రెండు నెలల కొడుకుని కట్టెల పొయ్యిలో వేసి కాల్చి చంపింది. ఈ హృదయవిదారకమైన ఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్లో పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్‌కు చెందిన రాజేంద్ర, మమత దంపతులు గతకొంతకాలంగా బౌరంపేటలోని నిర్మాణంలో ఉన్న సనారెల్లి అపార్ట్మెంట్లో భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తున్నారు. అయితే తనను రోజూ విసిగిస్తున్నాడన్న కోపంలో మమత కొడుకు పట్ల కర్కశంగా వ్యవహరించింది. చిన్నారిని ఏడవకుండా నోట్లో బట్టలు కుక్కి, కాళ్లు కట్టేసి మరి కట్టెల పొయ్యిలో పడేసి కాల్చి చంపడం కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై తండ్రి రాజేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నవమోసాలు మోసిన బిడ్డను చేజేతులారా చంపేంత ఆ తల్లికి మనసెలావచ్చిందని స్థానికులు వాపోతున్నారు.
‘డబుల్ బెడ్రూం లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ వెంటనే ఇవ్వాలి’
Cinema Is Dead | రాజమౌళితో మహేశ్ బాబు ఫైటింగ్.. AIతో సినిమా చనిపోయిందంటూ వర్మ పోస్ట్