BRS coucilar | అద్దె ఇంట్లో వృద్ధురాలు మృతి.. మృతదేహాన్ని రోడ్డుపై వేయించిన యజమాని.. అంత్యక్రియలకు ముందుకొచ్చిన బీఆర్ఎస్ కౌన్సిలర్
BRS coucilar | రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మార్కండేయ వీధిలో మామిడాల వీరమ్మ (80) అనే వృద్ధురాలు మంగళవారం ఉదయం మృతి చెందింది. ఆ వీధిలోని ఓ ఇంట్లో వీరమ్మ గత కొంతకాలంగా కొడుకు బాలరాజ్‌తో కలిసి ఉంటున్నది.
రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రమైన సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. పట్టణంలోని మార్కండేయ వీధిలో మామిడాల వీరమ్మ (80) అనే వృద్ధురాలు మంగళవారం ఉదయం మృతి చెందింది. ఆ వీధిలోని ఓ ఇంట్లో వీరమ్మ గత కొంతకాలంగా కొడుకు బాలరాజ్‌తో కలిసి ఉంటున్నది. బాలరాజు టెక్స్టైల్ పార్కులో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరమ్మ పెద్ద కొడుకు పాండు గతంలోనే చనిపోయాడు. భర్త విశ్వనాథం కూడా మృతిచెందాడు.
బాలరాజు భార్యతో విడిగా ఉంటూ తల్లి వీరమ్మను చూసుకుంటున్నాడు. మంగళవారం ఉదయం తీవ్ర అస్వస్థకు గురైన వీరమ్మ మృతిచెందింది. వీరమ్మ మృతిచెందిన విషయం ఇంటి యజమానికి తెలుపగా మృతదేహాన్ని ఇంట్లోకి అనుమతించలేదు. రోడ్డుపైనే ఉంచాలని చెప్పాడు. దాంతో చేసేదేమీ లేక రోడ్డుపైన ఓ బల్లపై మృతదేహాన్ని ఉంచారు. నిరుపేద నేత కుటుంబం కావడంతో కనీసం అంతక్రియలకు సైతం డబ్బు లేదని బాలరాజు విలపించాడు.
వృద్ధురాలు మృతదేహం రోడ్డుపైనే ఉండటం, రోడ్డుపైనే బంధువుల రోధనలు, ధైన్య స్థితిని చూసి కాలనీవాసులు చలించిపోయారు. ఈ విషయం బీఆర్ఎస్ కౌన్సిలర్ అడిచెర్ల రూప సాయికుమార్ తెలిసింది. దాంతో రూప సాయికుమార్ వీరమ్మ ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. వృద్ధురాలు అంతక్రియలు తామే తామే నిర్వహిస్తామని ధైర్యం చెప్పారు. అండగా ఉంటామని అన్నారు.
Read Today's Latest Karimnagar Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

