US vs Iran | అణు డిమాండ్ లేకుండానే ఇరాన్‌తో ఒప్పందానికి సిద్ధపడ్డ ట్రంప్..!
US vs Iran | ఎలాంటి అణు డిమాండ్ లేకుండానే ఇరాన్ (Iran) తో శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒకవైపు తరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మరోవైపు మధ్యంతర ఎన్నికలు.. ఇటు ఇరాన్‌తో ఎంతకీ తెగని చర్చలు.. వీటన్నింటి మధ్య అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు నలిగిపోతోంది.
US vs Iran : ఎలాంటి అణు డిమాండ్ లేకుండానే ఇరాన్ (Iran) తో శాంతి ఒప్పందానికి అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఒకవైపు తరిగిపోతున్న ఆయుధ నిల్వలు, మరోవైపు మధ్యంతర ఎన్నికలు.. ఇటు ఇరాన్‌తో ఎంతకీ తెగని చర్చలు.. వీటన్నింటి మధ్య అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు నలిగిపోతోంది.
పశ్చిమాసియాలో సుదీర్ఘ యుద్ధంతో లాభం కంటే నష్టమే ఎక్కువని బోధపడటంతో సొంత దేశంలోనే అధ్యక్షుడు ట్రంప్‌కు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. దాంతో యుద్ధం నుంచి బయటపడేందుకు అగ్రరాజ్యం మార్గాలు వెతుకుతోంది. ఈ క్రమంలో ఆది నుంచి పట్టుబట్టిన ‘న్యూక్లియర్ డీల్’ను సైతం పక్కనబెట్టేందుకు ట్రంప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అణు అంశాలు లేకుండానే టెహ్రాన్‌తో ఒప్పందం చేసుకోవాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా సంచలన కథనం ప్రచురించింది. ఇరాన్ ఎలాంటి షరతులు లేకుండా హర్మూజ్ జలసంధిని పూర్తిగా అందుబాటులోకి తెస్తే ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుందామని ట్రంప్ తన సన్నిహిత వర్గాలకు ప్రైవేటుగా చెప్పినట్లు సమాచారం. అణు డీల్ లేకుండానే ఈ యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారని తెలుస్తోంది.
శాంతి ఒప్పందం విషయంలో ఇటీవల అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చర్చలు ఫలించలేదు. మరోవైపు పశ్చిమాసియాలో ఘర్షణలు ఎంతకాలమైనా కొనసాగించేందుకు టెహ్రాన్ సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే ట్రంప్ అణు డీల్‌పై వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ తన డిమాండ్లను స్పష్టంగా చెబుతోంది.
అమెరికా దిగ్బంధనాన్ని వెంటనే ఎత్తివేయడంతో పాటు ఈ ప్రాంతం నుంచి అగ్రరాజ్య దళాలు వెళ్లిపోవాలని టెహ్రాన్ డిమాండ్ చేసింది. యుద్ధాన్ని శాశ్వతంగా ముగించేవరకూ హర్మూజ్‌ను తెరవబోమని కరాఖండీగా చెప్పింది. ఇవన్నీ చర్చలకు అడ్డంకిగా మారాయి. మరోవైపు అమెరికాలో మధ్యంతర ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఈ ఏడాది నవంబర్‌లో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి.
ఇక హర్మూజ్‌లో నౌకల రవాణాకు అంతరాయం కొనసాగుతుండటంతో చమురు ధరలు దిగిరావట్లేదు. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని యుద్ధం నుంచి బయటపడాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే బహిరంగంగా మాత్రం ఈ ఉద్రిక్తతలపై ట్రంప్ చేస్తున్న ప్రకటనలు భిన్నంగా ఉంటున్నాయి. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇరాన్‌తో చర్చల విషయంలో తొందరేం లేదు. మేం ప్రశాంతంగా ఉన్నాం. టెహ్రాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. వారి వద్ద సరిపడా నగదు లేదు’ అని వ్యాఖ్యానించడం గమనార్హం.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
Jantar Mantar | జంతర్ మంతర్ ఇకపై నిరసన వేదిక కాదు.. నిరసనల కోసం మూడు కొత్త ప్రాంతాలు
Pakistan | పాక్‌లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం.. ఖైబర్ పఖ్తున్ఖ్వా గవర్నర్ ఇంటికి నిప్పు..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

