సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు.
జాజిరెడ్డిగూడెం మాజీ జడ్పీటీసీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకుడు దావుల వీరప్రసాద్ యాదవ్‌ను అర్వపల్లి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్న వరుణయాగాన్ని అడ్డుకుంటారనే భయంతో తుంగతుర్తి మండల పరిధిలోని బీఆర్ఎస్ నాయకులను సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలగిరిలో బీఆర్ఎస్తో పాటు బీజేపీ నాయకులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Nalgonda3

Nalgonda2

Nalgonda1