Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Brothers Lifestyle Upgrade | అన్నాదమ్ముల జీవనశైలిలో ఆకస్మిక మార్పు చూసి గ్రామస్తులు నోరెళ్లబెట్టారు. వారిద్దరూ ఎకరాల కొద్దీ భూములు, ట్రాక్టర్ కొనుగోలు చేయడం, విలాసవంతంగా డబ్బు ఖర్చు చేయడంపై ఆశ్చర్యపోయారు. బ్లాక్ మనీపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ సోదరుల ఇంట్లో తనిఖీ చేశారు. భూమిలో పాతిన మూడు డ్రమ్ముల్లో కోట్ల డబ్బు ఉండటం చూసి షాక్ అయ్యారు.
లక్నో: అన్నాదమ్ముల జీవనశైలిలో ఆకస్మిక మార్పు చూసి గ్రామస్తులు నోరెళ్లబెట్టారు. వారిద్దరూ ఎకరాల కొద్దీ భూములు, ట్రాక్టర్ కొనుగోలు చేయడం, విలాసవంతంగా డబ్బు ఖర్చు చేయడంపై ఆశ్చర్యపోయారు. బ్లాక్ మనీపై సమాచారం అందుకున్న పోలీసులు ఆ సోదరుల ఇంట్లో తనిఖీ చేశారు. భూమిలో పాతిన మూడు డ్రమ్ముల్లో కోట్ల డబ్బు ఉండటం చూసి షాక్ అయ్యారు. (Brothers Lifestyle Upgrade) ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. రామ్‌నగర్ గ్రామంలోని బరైపూర్కు చెందిన సోదరులైన రాకేష్ యాదవ్, రాజేష్ యాదవ్ గతంలో పూణేలో పనిచేశారు. 2020లో కరోనా మహమ్మారి సమయంలో వారిద్దరూ తమ ఉద్యోగాలు వదిలేసి గ్రామానికి తిరిగి వచ్చారు.
కాగా, సాధారణ కుటుంబానికి చెందిన రాకేష్, రాజేష్‌ల ఆర్థిక పరిస్థితి, జీవనశైలిలో ఆ తర్వాత నుంచి భారీ మార్పులు రావడాన్ని స్థానికులు గమనించారు. చాలా తక్కువ కాలంలోనే ఆ గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎకరాల కొద్దీ భూములను వారు కొనుగోలు చేశారు. ఒక ట్రాక్టర్‌ను సమకూర్చుకున్నారు. విలాసవంతంగా డబ్బు ఖర్చు చేయడం మొదలుపెట్టారు. సాధారణ ఉద్యోగాలు చేసే అన్నాదమ్ములు ఇంత ధనవంతులుగా ఎలా మారారో తెలియక గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.
మరోవైపు ఇటీవల ఈ సోదరులు, గ్రామస్తుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో వారి వద్ద పెద్ద మొత్తంలో నల్లధనం ఉన్నట్లు స్థానిక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో నవాబ్‌గంజ్, సోరాన్ పోలీస్ స్టేషన్లకు చెందిన పోలీస్ బృందాలు అక్టోబర్ 28న ఆ సోదరుల ఇంట్లో సోదాలు చేశారు. మొదట ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదు.
అయితే ఖచ్చితమైన సమాచారం అందడంతో ఇంటిలోని ఒక గది నేలను పోలీసులు పరిశీలించారు. అక్కడ ఇటీవల మట్టి తవ్విన ఆనవాళ్లు కనిపించాయి. పోలీసులు వెంటనే కూలీలను పిలిచి తవ్వకాలు చేపట్టారు. భూమిలో పాతిన మూడు డ్రమ్ములు బయటపడ్డాయి. మందపాటి నల్ల ప్లాస్టిక్ షీట్లతో చుట్టి ఉన్న ఆ డ్రమ్ములను తెరిచి చూడగా రూ.500 నోట్ల కట్టలు బయటపడ్డాయి. కోట్లలో ఉన్న ఆ డబ్బును చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇంటిని పోలీసులు సీజ్ చేశారు.
కాగా, ఆదాయపు పన్ను శాఖ, ఇతర ఆర్థిక దర్యాప్తు సంస్థలకు ఈ విషయాన్ని తెలియజేసినట్లు గంగానగర్ డీసీపీ సోనం కుమార్ తెలిపారు. వారి సమక్షంలో ఆ నగదును అధికారికంగా లెక్కించే ప్రక్రియ జరుగుతుందని చెప్పారు. మూడు డ్రమ్ముల్లో బయటపడిన నోట్ల కట్టల విలువ ఎన్ని కోట్లు అన్నది అప్పుడు తెలుస్తుందన్నారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిని అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో అన్నది అతడ్ని ప్రశ్నిస్తున్నట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Nora Fatehi | నోరా ఫతేహికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
Samantha | తొమ్మిదో నెలలోనూ సమంత వర్కౌట్స్.. ‘ఫైనల్ ల్యాప్’ అంటూ ఆసక్తికర పోస్ట్!
Health tips | రాత్రి ధనియాలను నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంత మేలో తెలుసా..?
Supreme Court | విభేదాలొచ్చాయని ఆ బంధాన్ని అత్యాచారంగా పరిగణించలేం : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

