Donald Trump | మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా : డొనాల్డ్ ట్రంప్
Donald Trump | ఇరాన్ (Iran) తో యుద్ధం, ప్రపంచ దేశాలతో ఘర్షణల నేపథ్యంలో అమెరికా (USA) లో అధికశాతం ప్రజలు అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను వ్యతిరేకిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు (Democrats) మెజారిటీ సాధిస్తే.. తాను ‘మిస్టర్ వీటో (Mister Veto)’ గా మారాల్సి రావచ్చని పేర్కొన్నారు
Donald Trump : ఇరాన్ (Iran) తో యుద్ధం, ప్రపంచ దేశాలతో ఘర్షణల నేపథ్యంలో అమెరికా (USA) లో అధికశాతం ప్రజలు అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ను వ్యతిరేకిస్తున్నట్లు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్లు (Democrats) మెజారిటీ సాధిస్తే.. తాను ‘మిస్టర్ వీటో (Mister Veto)’ గా మారాల్సి రావచ్చని పేర్కొన్నారు. వారి అధికారాలను నియంత్రించేందుకు వీటో పవర్ (Veto Power) ను వినియోగిస్తానని చెప్పారు.
ఎన్నికల్లో డెమోక్రాట్లు గెలిచి కాంగ్రెస్‌పై పట్టు సాధిస్తే వారుచేసే బిల్లులను ఆమోదించకుండా అన్నింటినీ తిరస్కరిస్తానని ట్రంప్ అన్నారు. ఒకటి రెండు నెలలపాటు అలాచేస్తే చివరికి వారే తన దగ్గరికి వచ్చి ఒప్పందం చేసుకోవాలని చూస్తారని, అయితే అవన్నీ వృథా ప్రయత్నాలే అవుతాయని ట్రంప్ అన్నారు. తన పాలనలో చరిత్రలోనే అత్యుత్తమ ఆర్థికవ్యవస్థగా అమెరికా ఎదిగిందని పేర్కొన్నారు. రిపబ్లికన్లకు వచ్చే ఓట్లను సర్వేలు సరిగ్గా చూపించట్లేదని అసహనం వ్యక్తంచేశారు. అవకాశం వస్తే మరోసారి అధ్యక్ష స్థానానికి పోటీ చేయడానికీ తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు.
అయితే రాజ్యాంగ నిబంధనలు కఠినంగా ఉండడంవల్ల అది సాధ్యం కాకపోవచ్చని ట్రంప్ నిరాశ వ్యక్తంచేశారు. తన ప్రత్యర్థులపై గూఢచర్యం చేయడంలో చైనా, రష్యా కంటే మెరుగ్గా అమెరికా పనిచేస్తోందని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికా సైనిక స్థావరాలపై చైనా, రష్యా గూఢచర్యం చేస్తున్నాయని నిఘా అధికారులు తనకు చెప్పిన విషయాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు. వారి మాదిరిగానే వాషింగ్టన్ కూడా బీజింగ్, మాస్కోలను నిరంతరం పర్యవేక్షిస్తోందన్నారు. ఆ విషయం గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.
చైనా ప్రభుత్వ ఏజెంట్లుగా వ్యవహరించడానికి కుట్ర పన్నినందుకుగానూ అక్టోబర్ 30న లిరెన్, యువాన్స్ చెన్ అనే ఇద్దరు చైనా జాతీయులకు అమెరికా న్యాయశాఖ 30 నెలల జైలుశిక్ష విధించింది. అమెరికాలో మధ్యంతర ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇరాన్‌పై దాడులు ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరారు. అయితే ఆ దేశంతో ఒప్పందం చేసుకోవడానికి ప్రస్తుతం శాంతి చర్చలు కొనసాగించాలని తాను భావిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | మధ్యంతర ఎన్నికల్లో ఓడిపోతే మిస్టర్ వీటోగా మారుతా : డొనాల్డ్ ట్రంప్
Aadarsha Kutumbam | తొలి వారాంతంలోనే రూ.75 కోట్ల వసూళ్లు.. వెంకటేశ్ ‘ఆదర్శ కుటుంబం’ బ్లాక్‌బస్టర్ !
Sand mafia | ఇసుక మాఫియా అరాచకం.. అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వని వైనం : వీడియో
Poonam Kaur | ‘ఫేక్ గురూజీ’ అంటూ త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ ఫైర్.. కెరీర్‌ను ముగించారంటూ విమర్శలు!
Road accident | ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ.. 20 మంది ప్రయాణికులకు గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video

