Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
Viral News | కష్టపడి పనిచేయడం చేతగాక కొందరు, పనిచేస్తే వచ్చేదాని కంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చునని కొందరు వికలాంగుల (Handicapped) లా, అంధుల (Blind) లా నటిస్తూ భిక్షాటన (Begging) చేస్తుంటారు. రద్దీ ఏరియాల్లో వీరి నాటకాలను నమ్మి చాలామంది డబ్బులు వేస్తుంటారు. అచ్చం అలాగే తనకు పక్షవాతం వచ్చిందని నటిస్తూ భిక్షాటన చేస్తున్న ఓ బిచ్చగాడి (Begger) ఆటకట్టించారు కొందరు యువకులు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. సోషల్ మీడియా (Social Media) లో ఆ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
Viral News : కష్టపడి పనిచేయడం చేతగాక కొందరు, పనిచేస్తే వచ్చేదాని కంటే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చునని కొందరు వికలాంగుల (Handicapped) లా, అంధుల (Blind) లా నటిస్తూ భిక్షాటన (Begging) చేస్తుంటారు. రద్దీ ఏరియాల్లో వీరి నాటకాలను నమ్మి చాలామంది డబ్బులు వేస్తుంటారు. అచ్చం అలాగే తనకు పక్షవాతం వచ్చిందని నటిస్తూ భిక్షాటన చేస్తున్న ఓ బిచ్చగాడి (Begger) ఆటకట్టించారు కొందరు యువకులు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదుగానీ.. సోషల్ మీడియా (Social Media) లో ఆ ఘటనకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. పక్షవాతాన్ని నయంచేసే ఇంజక్షన్ ఇస్తామని ఆ యువకులు చెప్పగానే బిచ్చగాడు లేచి పరుగందుకోవడం నవ్వులు పూయిస్తోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఓ వ్యక్తి పక్షవాతంతో బాధపడుతున్నానంటూ రోడ్డు పక్కన మోచేతులపై పడుకుని భిక్షాటన చేస్తున్నాడు. ఇది గమనించిన కొందరు యువకులు అతడి దగ్గరకు వెళ్లారు. పక్షవాతం వచ్చి ఎన్నాళ్లయ్యింది, ఎలాంటి మందులు తీసుకుంటున్నావు అని అడిగారు. అనంతరం తమ దగ్గర పక్షవాతాన్ని తగ్గించే ఇంజక్షన్ ఉందని, పైగా ఈ ఇంజక్షన్ ఫ్రీగా ఇస్తామని ఓ ఇంజక్షన్ బయటికి తీశారు. అందులో ఏదో లిక్విడ్ నింపి అతడికి ఇవ్వబోతున్నట్లు నటించారు. అంతే ఆ బిచ్చగాడు ఒక్కసారిగా లేచి ఉసెన్ బోల్ట్ కంటే వేగంగా పరుగుతీశాడు.
బిచ్చగాడి ఆట కట్టించిన సదరు యువకులు ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను తమ మొబైల్లో రికార్డు చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్ల నుంచి ఫన్నీ కామెంట్స్ వస్తున్నాయి. పక్షవాతం ఇంజక్షన్ బాగా పనిచేసిందని ఓ యూజర్ కామెంట్ చేయగా.. క్షణాల్లో అద్భుతం జరిగిందని మరో యూజర్ స్పందించాడు. నేలమీద కదల్లేని స్థితిలో ఉన్నవాడు ఒక్కసారిగా స్ప్రింటర్ అయ్యాడని మరో యూజర్ రియాక్ట్ అయ్యాడు. ట్రీట్మెంట్ బాగా పనిచేసిందని ఇంకో యూజర్ స్పందించాడు.
ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పేరుతో భిక్షాటన చేస్తున్న యువకుడు పరుగందుకున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు.
“Paralyzed” Beggar Runs at Full Speed After Being Offered Treatment for Paralysis. https://t.co/7sDuOlM5f3
— WarMonitor (@WarMonitorINTL) October 26, 2026
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Spain Train Crash: డ్రైవర్లు, కంట్రోల్ సెంటర్ మధ్య సంభాషణ.. ఆడియో రిలీజ్ చేసిన స్పానిష్ మీడియా
Anirudh – Kaviya | అనిరుధ్ – కావ్య మారన్ రిసెప్షన్.. ప్రధాని, సీఎం విజయ్ సహా ప్రముఖులకు ఆహ్వానం!
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. పది మంది మృతి
‘ప్రభుత్వానికి పట్టభద్రులు బుద్ధి చెప్పాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

