మా అమ్మ ఓటమికి రేవంతే కారణం.. తెలంగాణకు ద్రోహం చేసేందే కాంగ్రెస్
‘దుబ్బాక ఉప ఎన్నికల్లో మా అమ్మ సుజాతకు టికెట్ ఇచ్చి కేసీఆర్ న్యాయం చేశారు. ఆ ఎన్నికల్లో హరీశ్‌రావు మా వెంటే ఉన్నారు. ఓటమి పాలైన తర్వాత కూడా మాకు అండగా నిలిచి కొండంత ధైర్యం అందించారు.
- మా కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నది కేసీఆర్, హరీశ్‌రావులే
- రామలింగారెడ్డికి అన్యాయం జరిగిందని రేవంత్ అనడం కపట ప్రేమ
- సోలిపేట తనయుడు సతీశ్‌రెడ్డి
దుబ్బాక, నవంబర్ 20 : ‘దుబ్బాక ఉప ఎన్నికల్లో మా అమ్మ సుజాతకు టికెట్ ఇచ్చి కేసీఆర్ న్యాయం చేశారు. ఆ ఎన్నికల్లో హరీశ్‌రావు మా వెంటే ఉన్నారు. ఓటమి పాలైన తర్వాత కూడా మాకు అండగా నిలిచి కొండంత ధైర్యం అందించారు. కానీ, ఆ ఉప ఎన్నిక ల్లో మా అమ్మ ఓటమికి రేవంత్‌రెడ్డి కుట్రలే కారణం’ అని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే దివంగత సోలిపేట రామలింగారెడ్డి తనయుడు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి స్పష్టంచేశారు. సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి సోలిపేట రామలింగారెడ్డిపై చేసిన వ్యాఖ్యలతో సతీశ్‌రెడ్డి స్పందించా రు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దు బ్బాకలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డిపై విరుచుకపడ్డారు. సిద్దిపేట సభలో తన తండ్రి సోలిపేట రామలింగారెడ్డిపై కపట ప్రేమను కనబరుస్తూ, కేసీఆర్, హరీశ్‌రావును దూషించడం సీఎం రేవంత్‌రెడ్డికి తగదని సూచించారు.
కాంగ్రెస్ తరఫున 2020 దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న విషయం మరిచిపోయారా? రేవంత్ అంటూ మండిపడ్డారు. నిజంగా సోలిపేట రామలింగారెడ్డిపై రేవంత్‌కు సానుభూతి ఉంటే ఆ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారానికి ఎందుకు వచ్చినట్టని ప్రశ్నించారు. తన తండ్రికి ముగ్గురు గురువులని.. వారిలో శాకమూరి అప్పారావు, రామచంద్రారావు, కేసీఆర్లేనంటూ తరచూ చెప్చేవారని గుర్తుచేశారు. తన అమ్మనాన్నల పెండ్లి పెద్దగా కేసీఆరే నాడు ఉన్నట్టు చెప్పారని గుర్తుచేశారు. రామలింగారెడ్డి జర్నలిస్టుగా, ఉద్యమకారుడిగా ఉన్న సమయం నుంచి సుమారు 40 ఏండ్లు కేసీఆర్‌తో అనుబంధం ఉన్నదని గుర్తుచేశారు. తన తండ్రికి రాజకీయ జీవితం ప్రసాదించింది కేసీఆరేనని తేల్చి చెప్పారు.
సొంతిల్లు లేదనడం సిగ్గుచేటు
తమకు ఇల్లే లేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉన్నదని సోలిపేట సతీశ్‌రెడ్డి తెలిపారు. సొంతింటితోపాటు తమ కష్టసుఖాల్లో నిరంతరం కేసీఆర్ అండగా ఉ న్నారని పునరుద్ఘాటించారు. జీవితాంతం కేసీఆర్, హరీశ్‌రావుకు రుణపడి ఉండాల్సిన బా ధ్యత తమపై ఉన్నదని పేర్కొన్నారు. తెలంగాణలో 1,300 మంది ఉద్యమకారులు చావుకు కాంగ్రెస్ కారణం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ తొలి దశ ఉద్యమ సమయం నుం చి నేటివరకు కాంగ్రెస్ వ్యతిరేకంగానే ఉన్నదని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కేసీఆర్‌తోనే సాధ్యపడిందని చెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

