నేపాల్ 26కే ఢమాల్
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యువ భారత జట్టు ఆల్‌రౌండ్ ఆటతో దుమ్మురేపింది. మొదట బ్యాట్‌తో తర్వాత బంతితో చెలరేగిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ శుక్రవారం జరిగిన తమ తొలి పోరులో నేపాల్‌పై ఏకంగా 306 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది.
- ప్రిన్స్, హర్షిత్ పేస్ దెబ్బకు విలవిల
- తిలక్ వర్మ, కుమార్ కుశాగ్ర శతకాలు
- 306 రన్స్ తేడాతో భారత్-ఏ విజయం
దోహా: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్‌లో యువ భారత జట్టు ఆల్‌రౌండ్ ఆటతో దుమ్మురేపింది. మొదట బ్యాట్‌తో తర్వాత బంతితో చెలరేగిన తిలక్ వర్మ సారథ్యంలోని భారత్-ఏ శుక్రవారం జరిగిన తమ తొలి పోరులో నేపాల్‌పై ఏకంగా 306 పరుగుల తేడాతో గెలిచి టోర్నీలో ఘనంగా బోణీ కొట్టింది. భారత్ ఇచ్చిన 333 పరుగుల ఛేదనలో నేపాల్ 69 బంతులు (11.3 ఓవర్లు) మాత్రమే ఆడి 26 రన్స్‌కే ఆలౌటై చిత్తయింది. ఆ జట్టులో ఒక్క బ్యాటర్ కూడా డబుల్ డిజిట్ స్కోరు చేయలేదు. ప్రిన్స్ యాదవ్ (5/6) ఐదు వికెట్ల ప్రదర్శనకు తోడు హర్షిత్ రాణా (4/16) పేస్‌కు నేపాల్ బ్యాటర్లు విలవిల్లాడారు.
ఈ పేస్ ద్వయం ధాటికి నేపాల్ స్కోరుబోర్డుపై పరుగుల కంటే వికెట్ల సంఖ్యే ఎక్కువగా కనబడటం గమనార్హం. కాగా లిస్ట్-ఏ క్రికెట్లో ఇది ఐదో అత్యల్ప స్కోరు. తొలుత ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కుమార్ కుశాగ్ర (117), తిలక్ వర్మ (107) శతకాలతో భారత్-ఏ 50 ఓవర్లలో 332/9 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ టోర్నీలో భారత్ ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఆడుతుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

