హైదరాబాద్ మూసాపేట మున్సిపల్ కార్యాలయం సమీపంలోని శ్రీ చిత్తారమ్మ ఆలయం పక్కన ఫుట్‌పాత్‌పై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆదివారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడి ఆచూకీ, వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.