కట్టంగూర్, ఫిబ్రవరి 24 : మహిళలు ఆర్థికంగా బలపడితే కుటుంబ స్థితి మెరుగు పడుతుందని కట్టంగూర్ మండలంలోని మునుకుంట్ల సర్పంచ్ గుల్లి నరేశ్ అన్నారు. మంగళవారం గ్రామంలో మదర్ థెరిసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముందస్తు అంతర్జాయ మహిళ దినోతవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముందుకు సాగాలని సూచించారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని తెలిపారు.
యువత డ్రగ్స్, తాగుడుకు బానిస కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మహిళలకు సూచించారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం పని చేస్తున్న మదర్ థెరిసా రూరల్ డెవలప్మెంట్ సొసైటీని అభినందించారు. ముగ్గుల పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. అనంతరం సర్పంచ్ నరేశ్‌ను మహిళా సంఘాల సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కడారి మల్లేష్, ఫాదర్ పొలిశెట్టి జూలియన్, యాపాల కుశలవ, నవ్య, గంటకంపు రామలింగమ్మ, జానకి, నవ్య, సుజాత, పద్మ, సంధ్యరాణి, నాగమణి, శ్రీలత, రుక్కమ్మ పాల్గొన్నారు.