Godavari Waters | ధర్మారం, జూలై 29: కాళేశ్వరం ప్రాజెక్టు అనుబంధ లింక్ -2 పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ధర్మారం మండలం నంది పంప్ హౌస్ ద్వారా గోదావరి జలాల ఎత్తిపోతలు ప్రారంభమైంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల ఆదేశానుసారం తాగునీటి అవసరాల కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్ మానేర్) నీటిని ఎత్తిపోయాలని ఆదేశాలు వచ్చాయి. దీంతో నంది పంప్ హౌస్‌లోని 1,4,5,6 నెంబర్ల మోటార్లను బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు స్థానిక ఇంజనీరింగ్ అధికారులు ఆన్ చేశారు. దీంతో జలాలు పంప్ హౌస్ నుంచి 4 డెలివరీ సిస్టర్న్‌ల ఎగిసిపడి నంది రిజర్వాయర్ లోకి వెళ్తున్నాయి.
ఒక్కో మోటార్ 3,150 క్యూసెక్కుల చొప్పున నీరు పంపింగ్ అవుతుంది.4 మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్ లోని క్రష్ గేట్ల ద్వారా జంట సొరంగాల నుంచి కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ కు అదే పరిమాణంలో నీరు తరలుతోంది. గాయత్రి పంపు హౌస్ లో బాహుబలి మోటార్లను ఆన్ చేయడంతో జలాలు శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి తరలుతున్నాయి. కాగా నీటి తరలింపు మూడు రోజులపాటు కొనసాగుతుందని ఆ శాఖ స్థానిక ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.
ఫలించిన బీఅర్ఎస్ పోరాటం
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన
నంది మేడారం,గాయత్రి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసిన ప్రభుత్వంకరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుండి నీరు విడుదల చేయాలంటూ కేటీఆర్, హరీష్ రావు పదే పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడంతో నీళ్లు విడుదల చేసిన ప్రభుత్వం
నంది, గాయత్రి పంప్… pic.twitter.com/2Tw5BSXcX4
— Telugu Scribe (@TeluguScribe) July 29, 2026
US Tariff Bill | అమెరికా రష్యాపై ఆంక్షల బిల్లు.. భారత్, చైనాలపై సుంకాల చిల్లు