షార్జా: వరల్డ్ చాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీ మూడవ సీజన్ నుంచి పాకిస్థాన్ చాంపియన్స్(Pakistan Champions) జట్టు తప్పుకున్నది. టోర్నీలో పాల్గొనేందుకు పాకిస్థాన్ బోర్డు అనుమతి ఇవ్వలేదని తెలిసింది. అయితే దీని వెనుక ఓ కారణం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డబ్ల్యూసీఎల్ నిర్వాహకులకు పీసీబీ కొన్ని షరతులు పెట్టింది. ఆ షరతులను డబ్ల్యూసీఎల్ అంగీకరించలేదు. దీంతో టోర్నీ నుంచి తప్పుకుంటున్నట్లు పాక్ ప్రకటించింది. గత ఏడాది పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఇండో, పాక్ క్రికెటర్లు ఏ మ్యాచ్‌లో ఆడినా.. షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు. అయితే భారత క్రికెటర్లు షేక్ హ్యాండ్ ఇవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు తన షరతులో కోరినట్లు తెలుస్తోంది.
గత ఏడాది జరిగిన ఘటన పట్ల క్షమాపణ కూడా చెప్పాలని పీసీబీ డిమాండ్ చేసింది. ఆ షరతులకు నిర్వాహకులు అంగీకరించకపోవడంతో.. పాక్ జట్టుకు పీసీబీ ఎన్వోసీ ఇవ్వలేదు. వాస్తవానికి టోర్నమెంట్ అక్టోబర్ 3నే ప్రారంభమైంది. ఇప్పటికే బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను పాకిస్థాన్ మిస్సైంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 10వ తేదీన ఇండియా, పాక్ తలపడాల్సి ఉన్నది. కానీ పాక్ తప్పుకోవడంతో ఆ మ్యాచ్ లేనట్లే.