తుంగతుర్తి, జూలై 29 : తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో డిప్యూటీ తాసీల్దార్ కంఠమయ్యకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా పలువురు అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ.. నియోజకవర్గనికి కేంద్ర బిందువుగా ఉన్న తుంగతుర్తిలో నూతనంగా మంజూరైన ఫైర్ స్టేషన్ ను ఏర్పాటు చేయడం వల్ల ఐదు మండలాలకు తిరుమలగిరి, నాగారం, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, నూతనకల్ ప్రాంతాలకు సౌకర్యార్థంగా ఉంటుందన్నారు. ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే మందుల సామెల్, జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ స్పందించి తుంగతుర్తిలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు కోసం కృషి చేయాలని కోరారు. లేనిపక్షంలో అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు తడకమళ్ల రవికుమార్, ఉప్పుల రాంబాబు, కొండ రాజు, గునిగంటి సంతోష్, బొంకూర్ మల్లేష్, బొజ్జ సాయికిరణ్, కొండగడుపుల వెంకటేష్, తడకమల్ల మల్లికార్జున్, బొంకురి మధు, బొంకూరి వెంకటేష్, తడకమళ్ల అనిల్, బొంకూరి సాయి, తడకమల్ల మధు, కాసర్ల రాజశేఖర్, కొండ మధు, కాసర్ల పవన్ పాల్గొన్నారు.