లక్నో: ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మరో మహిళతో కూడా అతడు సహజీవనం చేస్తున్నాడు. పదే పదే డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమెను హత్య చేశాడు. పెద్ద పెట్టెలో మృతదేహాన్ని ఉంచి తగులబెట్టాడు. (2 wives man kills live-in partner) ఆ పెట్టెను రెండో భార్య ఇంటికి పంపుతుండగా అనుమానించిన డ్రైవర్ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఈ సంఘటన జరిగింది. రిటైర్డ్ రైల్వే ఉద్యోగి రామ్ సింగ్‌కు ఇద్దరు భార్యలు ఉన్నారు. అయినప్పటికీ ప్రీతి అనే మహిళతో అతడు సహజీవనం చేస్తున్నాడు.
కాగా, రామ్ సింగ్‌ను ప్రీతి పదే పదే డబ్బులు డిమాండ్ చేస్తుండటంతో జనవరి 8న ఆమెను హత్య చేశాడు. మృతదేహాన్ని టార్పాలిన్‌లో చుట్టి కొంతకాలం దాచాడు. ఆ తర్వాత నీలం రంగులో ఉన్న పెద్ద పెట్టెలో ప్రీతి మృతదేహాన్ని ఉంచి తగులబెట్టాడు. బూడిదను నదిలో పడేశాడు.
మరోవైపు ఆ పెట్టెను మాయం చేసేందుకు రామ్ సింగ్ ప్రయత్నించాడు. కొడుకు సహాయంతో అద్దెకు తీసుకున్న లోడర్ వాహనంలో రెండో భార్య ఇంటికి పంపాడు. అయితే రవాణా సమయంలో దుర్వాసన వస్తున్న ఆ పెట్టె నుంచి నీరు కారడాన్ని లోడర్ డ్రైవర్ గమనించాడు. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
రామ్ సింగ్ రెండో భార్య ఇంటికి పోలీసులు చేరుకున్నారు. ఆ పెట్టెకు ఉన్న తాళాన్ని పగులగొట్టారు. అందులో కాలిన మానవ ఎముకలు, అవశేషాలు ఉండటం చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఆ అవశేషాలను ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు.
సహజీవనం చేస్తున్న ప్రీతిని రామ్ సింగ్ హత్య చేసినట్లు దర్యాప్తులో పోలీసులు తెలుసుకున్నారు. ఇద్దరు భార్యలు, కుమారుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. పరారీలో ఉన్న నిందితుడు రామ్ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు.
Also Read:
Newlywed Woman’s Body | నూతన వధువు మృతదేహాన్ని.. తల్లిదండ్రుల ఇంటి బయట వదిలివేశారు
Watch: మంచు కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఢీ.. మంటల్లో ఇద్దరు సజీవ దహనం