న్యూఢిల్లీ: రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్)కు చెందిన అధికారిణి 150 మందికిపైగా పిల్లలను రక్షించారు. ఈ నేపథ్యంలో ఆమె సేవలను రైల్వే మంత్రిత్వ శాఖ గుర్తించింది. రైల్వే అత్యున్నత పురస్కారంతో సత్కరించింది. (Woman Cop Honoured) ఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ చందనా సిన్హాకు భారత రైల్వే అత్యున్నత సేవా గౌరవమైన అతి విశిష్ట రైల్ సేవా పురస్కారాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అందజేశారు.
కాగా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన చందనా సిన్హా దూరదర్శన్‌లో ప్రసారమైన ‘ఉడాన్’ సీరియల్ ద్వారా స్ఫూర్తి పొందారు. 2010లో ఆర్పీఎఫ్లో చేరారు. 2024 నుంచి భారత రైల్వే ఆపరేషన్ ‘నాన్హే ఫరిష్టే’ (ఆపరేషన్ లిటిల్ ఏంజిల్స్)లో ఆమె భాగమయ్యారు. రైళ్లు, రైల్వే స్టేషన్ ప్రాంతాల్లో తప్పిపోయిన, మానవ అక్రమ రవాణాకు సంబంధించిన 152 మంది పిల్లలను ఆమె రక్షించారు.
మరోవైపు బచ్పన్ బచావో సమితితో కలిసి మరో 41 మంది పిల్లలను బాల కార్మికుల నుంచి చందనా సిన్హా విముక్తి కల్పించారు. అక్రమ రవాణా పిల్లలను పునరావాసం కోసం బాలల సంక్షేమ కమిటీకి అప్పగించారు. చందనా సిన్హా ధైర్యం, ‘నాన్హే ఫరిష్టే’పై అంకితభావం, పిల్లల భద్రత పట్ల నిరంతర నిబద్ధతను రైల్వే గుర్తించింది. రైల్వేల అత్యున్నత సేవా పురస్కారంతో ఆమెను సత్కరించింది.
Also Read:
Newlywed Woman’s Body | నూతన వధువు మృతదేహాన్ని.. తల్లిదండ్రుల ఇంటి బయట వదిలివేశారు
Noida techie drown in ditch | నీటి గుంతలోకి దూసుకెళ్లిన కారు.. టెకీ మృతి
Watch: మంచు కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఢీ.. మంటల్లో ఇద్దరు సజీవ దహనం