CM Omar Abdullah: చరిత్ర సృష్టించనున్న జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు.. హుబ్లీకి చేరుకున్న సీఎం ఒమర్ అబ్దుల్లా
CM Omar Abdullah: జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీని ఆ జట్టును సొంతం చేసుకోనున్నది. కర్నాటకతో జరుగుతున్న ఫైనల్లో జమ్మూకశ్మీర్ విజయం దాదాపు ఖాయమైంది. తమ జట్టుకు చీర్స్ చెప్పేందుకు సీఎం ఒమర్ అబ్దుల్లా హుబ్లీ చేరుకున్నారు.
బెంగుళూరు: జమ్మూకశ్మీర్ క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. రంజీ ట్రోఫీని ఆ జట్టును సొంతం చేసుకోనున్నది. కర్నాటకతో జరుగుతున్న ఫైనల్లో జమ్మూకశ్మీర్ విజయం దాదాపు ఖాయమైంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యాన్ని సాధించిన జమ్మూకశ్మీర్.. చరిత్రలో తొలిసారి రంజీ ట్రోఫీని తన ఖాతాలో వేసుకోనున్నది. ఇవాళ అయిదో రోజు ఆట కొనసాగుతోంది. అయితే ఆ సంబరాల్లో పాల్గొనేందుకు జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) తన బృందంతో కలిసి బయలుదేరారు. హూబ్లీలో జరుగుతున్న క్రికెట్ వేదికకు ఆయన చేరుకున్నారు.
శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం ఒమర్ అబ్దుల్లాతో పాటు మరికొంత మంది నేతలు హుబ్లీకి బయలుదేరి వెళ్లారు. ఫైనల్లోకి ప్రవేశించిన జమ్మూకశ్మీర్ జట్టు తమ రాష్ట్ర ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నట్లు ఆయన చెప్పారు. స్టాండ్స్‌లో ఉండి తమ జట్టుకు చీర్ చేయాలనుకుంటున్నట్లు ఒమర్ తన ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్‌నగర్‌లోని కేఎస్‌సీఏ స్టేడియంకు చేరుకుని తమ రాష్ట్ర జట్టుకు అభివాదం చేశారు.
Hubballi, Karnataka: Jammu and Kashmir CM Omar Abdullah arrived at KSCA Stadium, Rajnagar, for the final day of the Ranji Trophy and was welcomed by KSCA officials. pic.twitter.com/nw0eAeZENI
— IANS (@ians_india) February 28, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
Akka Teaser | ‘అక్క’ టీజర్‌తో ఆసక్తి రేపుతున్న కీర్తి సురేశ్.. రాధికా ఆప్టేతో హోరాహోరీ పోరు!
418 Movie | ప్రశాంత్ నీల్ మూవీ సరికొత్త ప్రయోగం.. అర్ధరాత్రి ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు ‘418’!
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

