పాట్నా: నూతన వధువు అనుమానాస్పదంగా మరణించింది. ఆమె మృతదేహాన్ని పోలీస్ అధికారి వాహనంలో తరలించారు. ఆమె తల్లిదండ్రుల ఇంటి బయట వదిలేశారు. వరకట్న వేధింపుల కారణంగా అత్తింటి వారు తన కుమార్తెను హత్య చేసినట్లు ఆమె తండ్రి ఫిర్యాదు చేశాడు. (Newlywed Woman’s Body) బీహార్‌లోని సరన్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పేడియా బజార్ ప్రాంతానికి చెందిన జయప్రకాష్ మహతో కుమార్తె సరితకు తొమ్మిది నెలల కిందట వైశాలి జిల్లాలోని కర్తహాన్ బుజుర్గ్ గ్రామానికి చెందిన సత్యేంద్ర కుమార్‌తో వివాహం జరిగింది.
కాగా, జనవరి 16న తెల్లవారుజామున 12.30 గంటల సమయంలో జయప్రకాష్ ఇంటి ముందు నల్లటి స్కార్పియో వాహనం ఆగింది. అందులో ఉన్న వ్యక్తులు సరిత మృతదేహాన్ని ఆ ఇంటి బయట వదిలేసి వెళ్లిపోయారు. ఉదయం ఇంటి బయట ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూసి ఆమె కుటుంబం షాక్ అయ్యింది. అదనపు కట్నం డిమాండ్ చేస్తున్న అత్తింటి కుటుంబం తన కుమార్తెను హత్య చేసి తమ ఇంటి బయట వదిలేశారని ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరోవైపు పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. సరిత మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. సరిత మృతదేహాన్ని తరలించిన స్కార్పియో వాహనం ముజఫర్‌పూర్ జిల్లాలో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ సంతోష్ రజక్ పేరుతో రిజిస్టర్ అయినట్లు గుర్తించారు. దీంతో సరిత మరణంతో పాటు ఆ వాహనానికి సంబంధించిన పోలీస్ అధికారి ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి వెల్లడించారు.
MURDERED FOR DOWRY OR ANOTHER WOMAN?
• Husband Dumps Wife’s Body at Father’s Doorstep📍Vaishali Bihar: 9 month bride Sarita strangled, body dumped at father’s door by husband in Scorpio at 12:38 AM… CCTV caught everything! And Father saw body at 6:30 AM.
• And this Black… pic.twitter.com/iajAhFuR7d
— زماں (@Delhiite_) January 17, 2026
Also Read:
Noida techie drown in ditch | నీటి గుంతలోకి దూసుకెళ్లిన కారు.. టెకీ మృతి
Watch: రోడ్డుపై వాగ్వాదం.. కారు డ్రైవర్‌ను కత్తితో బెదిరించిన స్కూటీ వ్యక్తి