డెహ్రాడూన్: జూనియర్ విద్యార్థిపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. అతడ్ని కొట్టడంతోపాటు జట్టు కత్తిరించాలని బలవంతం చేశారు. బాధిత విద్యార్థి ఫిర్యాదుతో కాలేజీ ర్యాగింగ్ నిరోధక కమిటీ దర్యాప్తు చేపట్టింది. (seniors assault Junior) ఆ సీనియర్ విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఈ సంఘటన జరిగింది. ప్రభుత్వ డూన్ మెడికల్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు.
కాగా, 2024, 2023 బ్యాచ్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు బెల్టులు, చెప్పులతో తనను కొట్టి హింసించినట్లు 2025 బ్యాచ్ మెడికల్ విద్యార్థి ఆరోపించాడు. కాలేజీ ప్రాంగణం బయటకు తనను తీసుకెళ్లారని, తన ఇష్టానికి విరుద్ధంగా జుట్టు కత్తిరించమని బలవంతం చేశారని, తనను బయట పడుకోబెట్టారని, తనను వేధించారని జనవరి 13న ఫిర్యాదు చేశాడు.
మరోవైపు ఆ మెడికల్ కాలేజీకి చెందిన ర్యాగింగ్ వ్యతిరేక కమిటీ చర్యలు ప్రారంభించింది. ర్యాగింగ్, శారీరక వేధింపులకు పాల్పడిన సీనియర్ విద్యార్థుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. ర్యాగింగ్ ఆరోపణలు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కాలేజీ యాజమాన్యం తెలిపింది. ఆ విద్యార్థులను సస్పెండ్ చేసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వారి తల్లిదండ్రులకు లేఖ ద్వారా సమాచారం ఇచ్చినట్లు వెల్లడించింది.
Also Read:
Boy Takes Mother’s Body To morgue | ఎయిడ్స్‌తో తల్లి మృతి.. 8 ఏళ్ల ఒంటరి కుమారుడు ఏం చేశాడంటే?
Watch: అమ్మకానికి పోలీస్ వాహనాలు.. ప్రకటన వీడియో చూసి పోలీసులు షాక్
Watch: పురుషుల వేషం వేసి.. ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళలు