భోపాల్: అమ్మకానికి పోలీస్ వాహనాలు ఉన్నట్లు ఒక వ్యక్తి ప్రకటించాడు. కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు సంప్రదించవచ్చని కోరాడు. దీనికి సంబంధించిన ప్రకటన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారు షాక్ అయ్యారు. (Police Vehicles On Sale) మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఈ సంఘటన జరిగింది. పాత పోలీస్ వాహనాలు అమ్మకానికి ఉన్నట్లు ఒక వ్యక్తి తెలిపాడు. ఆసక్తి ఉన్న వారు సంప్రదించవచ్చని పేర్కొన్నాడు.
కాగా, ‘గ్యాంగ్‌స్టర్ సెల్ వన్’ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశారు. దీంతో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది పోలీసుల దృష్టికి వెళ్లడంతో షాక్ అయ్యారు. సరైన వేలం ప్రక్రియ లేకుండా ప్రభుత్వ వాహనాలు విక్రయించడం సాధ్యం కాదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.
#WATCH | Video Selling Police Dial 100 Vehicle Surfaces On Social Media In MP’s #Jabalpur; Police Starts Probe#MadhyaPradesh #MPNews pic.twitter.com/mQYcHUSuZy
— Free Press Madhya Pradesh (@FreePressMP) January 16, 2026
Also Read:
AIMIM Big Win | మహారాష్ట్ర స్థానిక ఎన్నికల్లో ఏఐఎంఐఎం సత్తా.. 125 స్థానాల్లో గెలుపు
Man Murders Wife | భార్యను హత్య చేసి.. పోలీసులకు లొంగిపోయిన వ్యక్తి
Watch: పేలిన ట్రాన్స్ఫార్మర్.. వ్యక్తికి అంటుకున్న మంటలు