Puri Suriya Combo | టాలీవుడ్ మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో సినిమా రాబోతోందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి కాంబోలో సినిమా కోసం అభిమానులు దాదాపు దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ క్రేజీ ప్రాజెక్ట్ దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. వరుస పరాజయాల తర్వాత పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో ‘స్లమ్‌డాగ్ – 33 టెంపుల్ రోడ్’ అనే యాక్షన్ డ్రామాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం సెట్స్‌పై ఉండగానే, ఆయన సూర్యకు ఒక పవర్ఫుల్ స్టైలిష్ యాక్షన్ కథను వినిపించారని తెలుస్తుంది. పూరి మార్క్ క్యారెక్టరైజేషన్, మేకింగ్ స్టైల్ నచ్చడంతో సూర్య ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇక ఈ భారీ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించే అవకాశం ఉందని టాక్.
ప్రస్తుతం సూర్య ‘సూర్య 46’ (వెంకీ అట్లూరి దర్శకత్వంలో) షూటింగ్లో బిజీగా ఉన్నారు. అది పూర్తయిన తర్వాత లేదా మధ్యలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. గతంలో వీరిద్దరి కాంబోలో ‘బిజినెస్ మ్యాన్’ రావాల్సి ఉంది, కానీ అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు మళ్లీ అంతటి పవర్ఫుల్ సబ్జెక్ట్‌తోనే వీరు కలవబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.