అన్ష్, వాసవి గణేషన్ జంటగా నటించిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ ‘హుషార్ పిట్టలు’. బిక్షు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రుద్రకాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ నిర్మించారు. ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకురానుంది. గురువారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. నిర్మాత వెంకట్ యాదవ్ మాట్లాడుతూ ‘ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది ప్రీమియర్షోస్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నది.
వినోదంతో పాటు హృదయాన్ని కదిలించే భావోద్వేగాలున్న కథ ఇది. చరణ్ అర్జున్ మ్యూజిక్ ప్రత్యేకాకర్షణగా నిలుస్తుంది’ అన్నారు. నేటి యువతకు చక్కటి సందేశాన్ని అందించే చిత్రమిదని, హిట్ పక్కా అని హీరో అన్ష్ నమ్మకం వ్యక్తం చేశారు. ఒక జనరేషన్లో మార్పుతెచ్చే సినిమా ఇదని కథానాయిక వాసని గణేషన్ చెప్పింది. ఈ చిత్రానికి కెమెరా: రుద్రసాయి, సంగీతం: చరణ్‌అర్జున్, దర్శకత్వం: బిక్షు.