Arvind Kejriwal: లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్, సిసోడియాకు విముక్తి
Arvind Kejriwal: లిక్కర్ కుంభకోణం కేసు నుంచి కేజ్రీవాల్, సిసోడియాలను డిశ్చార్జ్ చేశారు. ఆ కేసులో బలమైన సాక్ష్యాధారాలను చూపించలేదని ఢిల్లీ కోర్టు తన తీర్పులో చెప్పింది. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పనలో భారీ అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు ఉపశమనం కలిగింది. ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal), మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఉన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఆ ఇద్దరికీ ఆ కేసులో నమోదు అయిన అభియోగాల నుంచి విముక్తి లభించింది. మద్యం విధానాన్ని రూపొందించే క్రమంలో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఢిల్లీ కోర్టు పేర్కొన్నది. ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ఎటువంటి కుట్ర కానీ, నేరపూరిత ఉద్దేశం కానీ లేదని ఢిల్లీ కోర్టు ఇవాళ వెల్లడించింది. కేజ్రీవాల్, సిసోడియాపై ఆధారాలను ప్రవేశపెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలమైనట్లు కోర్టు తెలిపింది.
మద్యం కుంభకోణం కేసును సీబీఐ దర్యాప్తు చేపట్టిన విషయం తెలిసిందే. ఎక్సైజ్ శాఖ పాలసీలో చోటుచేసుకున్న అక్రమాల్లో ఆ ఇద్దరి పాత్ర ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది. కానీ విచారణ సమయంలో పక్కా ఆధారాలను చూపించలేకపోయినట్టు కోర్టు చెప్పింది. ప్రస్తుతం ఆ వివాదాస్పద ఎక్సైజ్ చట్టాన్ని రద్దు చేసిన విషయం తెలిసిందే. కేవలం అపోహల మీద తీవ్రమైన కేసును వాదించలేమని, ఆరోపణలకు తగిన రీతిలో బలమైన సాక్ష్యాలను కూడా ప్రవేశపెట్టాలని కోర్టు అభిప్రాయపడింది.
ఈ కేసులో స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ ఆదేశాలు ఇచ్చారు. కేజ్రీవాల్, సిసోడియాతో పాటు మరో 21 మందిని ఆ కేసు నుంచి డిశ్చార్జ్ చేస్తున్నట్లు చెప్పారు. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను స్వీకరించేందుకు కోర్టు నిరాకరించింది. ఛార్జ్షీట్లో చాలా లోపాలు ఉన్నాయని, ఎటువంటి సాక్ష్యాలు లేని అంశాలు చాలా ఉన్నట్లు కోర్టు చెప్పింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

