బెంగళూరు: ఓవర్ టేక్ అంశంపై స్కూటీ నడిపిన వ్యక్తి, కారు డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో స్కూటీ వ్యక్తి కత్తి తీసి కారు డ్రైవర్ వద్దకు వెళ్లి బెదిరించాడు. (Biker Pulls Out Knife) అతడ్ని దూషించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని రోడ్డుపై వెళ్తున్న కారు, స్కూటీ చాలా దగ్గర నుంచి క్రాస్ అయ్యాయి. ఒక ట్రాఫిక్ సిగ్నల్ వద్ద అవి ఆగాయి.
కాగా, స్కూటీ నడిపిన వ్యక్తి కారు డ్రైవర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఆగ్రహంతో ప్యాంటు జేబులో ఉన్న కత్తిని బయటకు తీశాడు. కారు డ్రైవర్ వద్దకు వెళ్లి కత్తితో బెదిరించాడు. అతడ్ని దూషించాడు. ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో స్కూటీపై అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
మరోవైపు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన కారు డ్యాష్ బోర్టుపై ఉన్న కెమెరాలో ఇది రికార్డ్ అయ్యింది. దీంతో ఆ వ్యక్తి ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. స్కూటీ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తిని అర్బాజ్ ఖాన్‌గా గుర్తించినట్లు పేర్కొన్నాడు. రోడ్డుపై ఘర్షణకు దిగి కత్తితో బెదిరించిన అతడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ వీడియో క్లిప్‌ను డీసీపీకి ట్యాగ్ చేశాడు. దీంతో పోలీసులు స్పందించారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
@dcpwhitefield @BlrCityPolice @CPBlr Person riding KA53JB3274 (registered in the name of Arbaz Khan) openly brandishing dagger in traffic opposite Nexus Shantiniketan Mall at around 6PM on Jan 16th, 2026. Roadraging, abusing and threatrning. @karnatakaportf pic.twitter.com/6H5TQq7LJD
— A Reddy (@reddy1076333) January 16, 2026
Also Read:
Noida techie drown in ditch | నీటి గుంతలోకి దూసుకెళ్లిన కారు.. టెకీ మృతి
Watch: అమ్మకానికి పోలీస్ వాహనాలు.. ప్రకటన వీడియో చూసి పోలీసులు షాక్