హైదరాబాద్, ఫిబ్రవరి 23(నమస్తే తెలంగాణ): ఐటీ మాత్రమే కాకుండా పలు ఇతర రంగాల్లో కూడా హైదరాబాద్‌ను ‘గ్లోబల్ వ్యాల్యు క్రియేషన్ హబ్’గా మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అంతర్జాతీయ బీమా దిగ్గజం హార్ట్ఫోర్డ్ 1.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన గ్లోబల్ టెక్ సెంటర్‌ను ఆయన ప్రారంభించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. బ్యాంకింగ్, ఫైనాన్షియల్, లైఫ్ సైన్సెస్, హెల్త్ కేర్, ఏరో స్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, డీప్ టెక్, రిటైల్ తదితర రంగాలపై దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. . ఈ కార్యక్రమంలో హార్ట్ఫోర్డ్ చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శేఖర్ పన్నాల మాట్లాడుతూ.. తాజాగా ప్రారంభించిన ఈ నూతన కార్యాలయం యూఎస్‌లోని హార్ట్ఫోర్డ్, చికాగో, షార్లెట్, కొలంబస్లో ఉన్న టెక్నాలజీ కేంద్రాలకు అనుబంధంగా పని చేస్తూ ఏఐ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, అడ్వాన్డ్స్ టెక్నాలజీ డెవలెప్మెంట్పై దృష్టి సారిస్తూ ‘ఇంజనీరింగ్ ఎక్సలెన్స్ హబ్‌గా కూడా పనిచేయనున్నదన్నారు.