Anand Devarakonda | వదిన వచ్చేసింది .. రష్మికపై ఆనంద్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Anand Devarakonda | ఫిబ్రవరి 26న టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇప్పటికే వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నాయి.
Anand Devarakonda | ఫిబ్రవరి 26న టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లో జరిగిన ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇప్పటికే వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను ఆనందంలో ముంచెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇలాంటి ఆనంద వాతావరణంలో విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ చేసిన ఓ స్పెషల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. రష్మిక, విజయ్‌తో కలిసి దిగిన ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆయన “వదిన” అంటూ హృదయపూర్వక సందేశం రాశారు.
ఆనంద్ తన పోస్ట్‌లో .. చాలాసార్లు ఫ్యాన్స్ ‘వదిన ఎలా ఉన్నారు?’ అని అడిగేవారు. అప్పుడు నేను ఎలా స్పందించాలో తెలియదు. కానీ ఈరోజు మా అన్న పెళ్లి చేసుకున్నాడు. చాలా పాజిటివ్‌గా, దయతో ఉండే వ్యక్తి నాకు వదినగా వచ్చింది. వాళ్లు జీవితాంతం ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను” అని ఎమోషనల్‌గా రాశారు. ఈ మాటలు అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ‘వదిన’ అని అధికారికంగా పిలవడం ఫ్యాన్స్‌లో ప్రత్యేక ఆనందాన్ని కలిగించింది. కొన్నేళ్లుగా వీరి రిలేషన్‌పై వస్తున్న వార్తలకు ఇది ఫుల్ స్టాప్ వేసినట్టైంది.
విజయ్-రష్మిక జంటపై సోషల్ మీడియాలో ఎప్పటినుంచో భారీ క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల తర్వాత నుంచే వీరి మధ్య కెమిస్ట్రీపై అభిమానులు ఆసక్తి చూపారు. ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటవ్వడంతో ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఆనంద్ దేవరకొండ పోస్ట్‌కు వేలాది లైకులు, కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. “బెస్ట్ వదిన”, “క్యూట్ ఫ్యామిలీ”, “గాడ్ బ్లెస్ యూ” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి సందర్భంగా పలువురు టాలీవుడ్ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు. పరిశ్రమలో వీరిద్దరికీ ఉన్న మంచి పేరు, పాపులారిటీ కారణంగా సోషల్ మీడియాలో పెళ్లి ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఇక వీరి రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్‌లో జరుపుకోనున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

