FCRA Bill: జేపీసీకి ఎఫ్సీఆర్ఏ బిల్లు.. లోక్సభలో తీర్మానం పాస్
FCRA Bill: వివాదాస్పద ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లును పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ బిల్లును పాస్ చేస్తూ లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. జేపీసీ కమిటీలో 21 మంది లోక్సభ, పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు.
న్యూఢిల్లీ: వివాదాస్పద ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ అమెన్డ్మెంట్ బిల్లు(FCRA Bill) 2026ను పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆ బిల్లును పాస్ చేస్తూ లోక్సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ బిల్లులో ఉన్న అంశాలపై విపక్షాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జేపీసీకి బిల్లును కమిటీకి పాస్ చేశారు. పార్లమెంటరీ స్థాయి సంఘంలో 21 మంది లోక్సభ, పది మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల తొలివారం చివరి రోజున జేపీసీ తన నివేదికను సమర్పిస్తుంది. ఎఫ్సీఆర్ఏ ఎజెండాను పూర్తిగా విత్డ్రా చేసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆ బిల్లును జేపీసీకి పంపేందుకు ఆసక్తిగా ఉన్నట్లు మంగళవారం ప్రభుత్వం పేర్కొన్న విషయం తెలిసిందే. క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని అనేక క్రైస్తవ సంఘాలు, మీజోరం.. నాగాలాండ్ సీఎంలు, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే పార్టీలు కూడా ఎఫ్సీఆర్ఏ బిల్లును వ్యతిరేకిస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లును మార్చి 25వ తేదీన లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా ఎన్జీవోలు, విదేశీ నిధులపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టనున్నది.
ఇండియాలోని కంపెనీలకు, స్వచ్ఛంద సంస్థలకు విదేశాల నుంచి అందుతున్న నిధులపై నియంత్రణకు, పారదర్శకత కోసం కేంద్రం ఈ బిల్లును తీసుకొస్తోంది. ఈ బిల్లు ప్రకారం విదేశాల నుంచి అందుతున్న నిధుల కోసం ఒక ప్రత్యేక పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విదేశీ సంస్థలకు చెందిన నిధులు, ఆస్తులు, విరాళాల్ని ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. మతపరమైన సంస్తకు చెందిన ఆస్తుల విషయంలో కూడా ఆయా నిర్వహణా సంస్థలు వాటి ఔన్నత్యాన్ని, విశ్వాసాన్ని కాపాడాలి. ఈ విషయంలో ఏదైనా సంస్థ నిబంధనలు ఉల్లంఘిస్తే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు. ఈ బిల్లును తమిళనాడుతో పాటు మిజోరం వ్యతిరేకిస్తున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- FCRA Bill
- JPC
- lok sabha
- Parliament
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Vijay | ప్రజలకు తాగునీటి కోసం ఏపీలో తమిళనాడు సీఎం.. అధిష్టానం మెప్పుకోసం ఢిల్లీలో రేవంత్..!
KU | కేయూ బయోటెక్నాలజీ విభాగాధిపతిగా శ్రీనివాస్..!
Nalgonda | గ్రామసభల్లోనే ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ఎంపిక జరగాలి.. కలెక్టర్కు సర్పంచుల సంఘం జేఏసీ వినతి..!
Weight Loss | బరువు తగ్గాలంటే నీరే తాగాలా? డైట్ సాఫ్ట్ డ్రింక్స్తోనూ ఫలితం.. అధ్యయనంలో వెల్లడి..
RS Praveen kumar | ‘మీరే మీ మేనమామపై కేసు పెట్టాలి’.. కాంగ్రెస్ ఎమ్మెల్యే మేఘా రెడ్డికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సూచన..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

