CM Vijay | తమిళనాడులో ఎనిమిదో తరగతి వరకు బ్రేక్ఫాస్ట్ పథకం.. ప్రారంభించిన సీఎం విజయ్
CM Vijay : తమిళనాడులోని ప్రభుత్వ స్కూళ్లలో ఇకపై 6-8 తరగతి విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ పథకాన్ని తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం ఉదయం ప్రారంభించారు.
CM Vijay : తమిళనాడులోని ప్రభుత్వ స్కూళ్లలో ఇకపై 6-8 తరగతి విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయనుంది ప్రభుత్వం. ఈ పథకాన్ని తమిళనాడు సీఎం విజయ్ మంగళవారం ఉదయం ప్రారంభించారు. ఇప్పటికే పెరుతలైవార్ కామరాజార్ అల్పాహారం పేరుతో ప్రభుత్వ స్కూళ్లలో ఈ పథకం అమలవుతోంది.
ఇప్పటిదాకా ఒకటి నుంచి ఐదో తరతి పిల్లలకు మాత్రమే ప్రభుత్వ స్కూళ్లలో అల్పాహారం అందిస్తుండగా.. ఇకపై ఎనిమిదో తరగతి వరకు ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. దీంతో విద్యార్థినీ, విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. మంగళవారం సీఎం విజయ్.. చెన్నై, తిరువన్మియుర్, గాంధీ గ్రామంలో ఉన్న ప్రభుత్వ స్కూల్లో పథకాన్ని విస్తరించారు. ఈ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఉదయం అల్పాహారం చేశారు. గవర్నమెంట్ స్కూళ్లతోపాటు, గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్లలో కూడా ఈ పథకాన్ని అమలు చేస్తారు.
ఈ పథకం ఇప్పుడు రాష్ట్రంలోని 15,454 స్కూళ్లలో, 15.30 లక్షల మంది విద్యార్థులకు దీని ద్వారా లబ్ధి కలుగుతుంది. ఈ పథకాన్ని విస్తరించేందుకు అదనంగా ఏడాదికి రూ.217.63 కోట్లు ఖర్చవుతుంది. మొత్తం పథకానికి అయ్యే ఖర్చు ఏడాదికి రూ.724 కోట్లకు చేరింది. గతంలో ఈ పథకానికి సీఎం బ్రేక్ఫాస్ట్ అనే పేరుండేది. అయితే, తమిళనాడు మాజీ సీఎం, కాంగ్రెస్ నేత దివంగత కే కామరాజ్ పేరు మీద ఈ పథకాన్ని తిరిగి ప్రారంభించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ACB Raid | ఏసీబీకి చిక్కిన విద్యుత్ ఏఈ..రూ.1.20 లక్షల లంచం తీసుకుంటూ పట్టివేత
‘దాసరి నెమలిపూర్ మీదుగా చెర్కుపల్లి వరకు బస్సు నడపాలి’
Satish Kumar | బీఆర్ఎస్ కార్యకర్తలకు అండగా ఉంటా : మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్
‘కోదాడ నియోజకవర్గంలోని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి’
Vishvajit More | వరల్డ్ ఛాంపియన్షిప్స్లో రజతం.. చరిత్ర సృష్టించిన యువ రెజ్లర్..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

