Weekend OTT | ఫిబ్రవరి చివరి వారాంతంలో ఇంటి వద్దే వినోదాన్ని ఆస్వాదించాలనుకునే ప్రేక్షకులకు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లు భారీగానే కంటెంట్‌ను సిద్ధం చేశాయి. ముఖ్యంగా ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’, నవీన్ చంద్ర ‘హనీ’ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఈ వారం డిజిటల్ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే ఈ వారం ఏఏ చిత్రాలు ఎందులో ఉన్నాయి అనేది చూసుకుంటే.
అమెజాన్ ప్రైమ్ వీడియో
ది బ్లఫ్ (The Bluff): ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది.
ఇక్కీస్ (Ikkis): అగస్త్య నంద నటించిన హిందీ చిత్రం.
సైకో సయ్యాన్ (Psycho Saiyaan): హిందీ వెబ్ సిరీస్.
జెనో (Xeno): ఇంగ్లీష్ మరియు ఇతర భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది.
రిటర్న్ టు సైలెంట్ హిల్, ది హౌస్‌మెయిడ్, ఆర్కో వంటి పలు ఆంగ్ల చిత్రాలు రెంటల్ పద్ధతిలో ఉన్నాయి.
నెట్‌ఫ్లిక్స్
అక్యూజ్డ్ (Accused): కొంకణ సేన్ శర్మ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్. తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
బ్రిడ్జర్టన్ సీజన్ 4 – పార్ట్ 2 (Bridgerton S4): పాపులర్ ఇంగ్లీష్ సిరీస్. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది.
ఫార్ములా 1: డ్రైవ్ టు సర్వైవ్ – సీజన్ 8 (Formula 1): రేసింగ్ డాక్యుమెంటరీ సిరీస్.
బాకీ-డౌ (BAKI-DOU): జపనీస్ యానిమేషన్ సిరీస్.
జియో హాట్‌స్టార్
రోస్లిన్ (Roslin): జీతు జోసెఫ్ నిర్మించిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్ తెలుగు, మలయాళం సహా 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది.
బ్లాక్ ఫోన్ 2 (Black Phone 2): హారర్ థ్రిల్లర్ మూవీ.
సంగ్ మర్మర్ (Sangamarmar): హిందీ సిరీస్.
ప్యారడైజ్ సీజన్ 2 (Paradise): ఇంగ్లీష్ సిరీస్.
క్షేత్రపతి (Kshetrapati): కన్నడ చిత్రం.
జీ5
డాటర్ ఆఫ్ వరప్రసాద్ రావు కనబడుటలేదు (D/o Prasad Rao): రాజీవ్ కనకాల ప్రధాన పాత్రలో నటించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.
తడయం (Thadayam): సముద్రఖని నటించిన తమిళ థ్రిల్లర్ సిరీస్.
అంధా ప్యార్ 2 (Andha Pyaar 2): హిందీ రియాలిటీ షో/సిరీస్.
ఆహా (Aha Video)
హాట్‌స్పాట్ 2 మచ్ (Hotspot 2 Much) తెలుగులో అందుబాటులో ఉంది.
సర్కార్ సీజన్ 6: తెలుగు పాపులర్ గేమ్ షో (ఫిబ్రవరి 27 నుంచి).
ఇతర ప్లాట్‌ఫారమ్‌లు
సన్ నెక్స్ట్ (Sun NXT): ‘హనీ’ (Honey) – నవీన్ చంద్ర నటించిన హారర్ థ్రిల్లర్ ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది.
ఈటీవీ విన్ (ETV Win): ‘శ్రీ చిదంబరం గారు’ మరియు ‘పాణిగ్రహణం’ అనే తెలుగు చిత్రాలు ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఆపిల్ టీవీ+ (Apple TV+): ‘మోనార్క్: లెగసీ ఆఫ్ మాన్స్టర్స్ సీజన్ 2’.