చండీగఢ్: మంచు కారణంగా ఎక్స్‌ప్రెస్ వేపై పలు వాహనాలు ఢీకొన్నాయి. మంటలు చెలరేగడంతో ఒక వాహనంలోని ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. (massive vehicles crash) హర్యానాలోని నుహ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో పొగమంచు కారణంగా కుండ్లి-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేపై పలు వాహనాలు ఢీకొన్నాయి.
కాగా, ఒక భారీ వాహనం ఆకస్మికంగా బ్రేక్‌లు వేయడంతో ఈ ప్రమాదం జరిగింది. దాని వెనుక ఉన్న వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. కంకర లోడ్ ఉన్న డంపర్, అమెజాన్ వస్తువులను రవాణా చేస్తున్న కంటైనర్‌లో మంటలు వ్యాపించాయి. డంపర్‌లో ఉన్న రాజస్థాన్‌కు చెందిన డ్రైవర్, హెల్పర్ మంటల్లో కాలి సజీవ దహనమయ్యారు. గాయపడిన మరి కొందరిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు గురుగ్రామ్ నుంచి లక్నో వెళ్తున్న అమెజాన్ కంటైనర్‌లో బట్టలు, షూస్, మొబైల్ ఫోన్లు వంటి వస్తువులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మంటల కారణంగా సరుకు పూర్తిగా దగ్ధమైందని చెప్పారు. సుమారు రూ.1.25 కోట్ల నష్టం వాటిల్లిందని అంచనా వేశారు. రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన కొన్ని పార్సిల్‌ను కొందరు వ్యక్తులు ఎత్తుకెళ్లగా మిగతా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అక్కడకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు గంటలు శ్రమించి మంటలను ఆర్పివేశారు. ఆ తర్వాత క్రేన్ సహాయంతో దగ్ధమైన వాహనాలను రోడ్డు పక్కకు తొలగించారు. ఈ ప్రమాదం వల్ల సుమారు ఆరు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు నాలుగు గంటలకుపైగా శ్రమించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.
అయితే ఒక డంపర్, అమెజాన్ పార్సిల్ కంటైనర్, మూడు ట్రైలర్స్ ఈ ప్రమాదంలో ధ్వంసమైనట్లు పోలీస్ అధికారి తెలిపారు. సజీవ దహనమైన డంపర్ డ్రైవర్, హెల్పర్ మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించినట్లు చెప్పారు. చలికాలంలో వాహన డ్రైవర్లు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
VIDEO | Nuh, Haryana: Five vehicles collided, triggering a massive crash and fire. Two people were killed in the incident as flames engulfed the vehicles. More details are awaited.#Nuh #RoadAccident #Haryana
(Full video available on PTI Videos – https://t.co/n147TvqRQz) pic.twitter.com/VeonttNqYL
— Press Trust of India (@PTI_News) January 18, 2026
#WATCH | Nuh, Haryana: Two killed in multi-vehicle collision amid dense fog on Kundli-Manesar-Palwal (KMP) highway. pic.twitter.com/pFiZ8dDCXu
— ANI (@ANI) January 18, 2026
Also Read:
Newlywed Woman’s Body | నూతన వధువు మృతదేహాన్ని.. తల్లిదండ్రుల ఇంటి బయట వదిలివేశారు
Noida techie drown in ditch | నీటి గుంతలోకి దూసుకెళ్లిన కారు.. టెకీ మృతి
Watch: రోడ్డుపై వాగ్వాదం.. కారు డ్రైవర్‌ను కత్తితో బెదిరించిన స్కూటీ వ్యక్తి