Deepika Padukone | బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే ఇటీవల వరుస వార్తలతో ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారుతున్నారు. ఆమె కండీషన్స్ కారణంగా ఇప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులు చేజారిపోతున్నాయనే ప్రచారం గత కొద్ది రోజులుగా నడుస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న స్పిరిట్, కల్కి 2 చిత్రాల నుంచి ఆమె బయటకు వచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరో హాలీవుడ్ అవకాశం కూడా చేజారిందనే టాక్ వినిపిస్తోంది. హాలీవుడ్లో పాపులర్ సిరీస్‌గా రూపొందిన ది వైట్ లోటస్( The White Lotus ) నాలుగవ సీజన్ కోసం దీపికా పదుకొనే పేరును మేకర్స్ పరిశీలించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గ్లోబల్ రీచ్ ఉన్న ఈ సిరీస్‌లో నటించే అవకాశం దక్కింది అంటే అంతర్జాతీయంగా మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంటుంది.
అయితే ఈ ప్రాజెక్ట్ కోసం మేకర్స్ ఆమెను ఆడిషన్‌కు రావాలని కోరినట్లు సమాచారం. కానీ, తాను ఆడిషన్‌కు హాజరు కాలేనని దీపికా స్పష్టం చేసినట్లు టాక్ వినిపిస్తోంది. దీంతో ఆమె స్థానంలో మరో నటిని ఎంపిక చేసుకునే దిశగా ‘ది వైట్ లోటస్’ టీమ్ ముందుకు సాగిందని తెలుస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ సిరీస్‌లో నటించే అవకాశం కోల్పోయిందనే వార్తలతో దీపికా అభిమానులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే కొన్ని పెద్ద ప్రాజెక్టుల నుంచి బయటకు వచ్చిన నేపథ్యంలో, హాలీవుడ్ కమ్‌బ్యాక్‌కు ఇది మంచి అవకాశంలా భావించకుండా ఇలా ఎందుకు బయటకు వచ్చిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
గతంలో దీపికా xXx:రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ చిత్రంతో హాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ సినిమాలో ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించినప్పటికీ, ఆ తర్వాత అంతర్జాతీయ ప్రాజెక్టుల్లో ఆమె కనిపించలేదు. దీంతో చాలా కాలంగా సరైన గ్లోబల్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తోందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పుడు ‘ది వైట్ లోటస్ 4’ అవకాశం నిజంగా మిస్ అయ్యిందా? లేక కేవలం రూమర్ మాత్రమేనా? అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఒకవేళ ఇది నిజమైతే, గ్లోబల్ స్థాయిలో మెరవడానికి ఉన్న మరో మంచి ఛాన్స్‌ను దీపికా వదులుకున్నట్లే అవుతుంది.