Kim Jong Un: పార్టీ, మిలిటరీ అధికారులకు స్నైపర్ రైఫిళ్లు బహూకరించిన కిమ్ జాంగ్ ఉన్
Kim Jong Un: ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్.. ప్రభుత్వ, మిలిటరీ అధికారులకు కొత్త స్నైపర్ రైఫిళ్లను బహూకరించారు. ఇటీవల వారం రోజుల పాటు అధికార పార్టీ సంబరాలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ రైఫిళ్లను అందించినట్లు తెలుస్తోంది. కిమ్ జాంగ్ టీనేజ్ కుమార్తె కూడా ఆ ఈవెంట్లో పాల్గొన్నది.
ప్యోంగ్యాంగ్: ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్(Kim Jong Un).. ప్రభుత్వ ఉన్నతాధికారులు, మిలిటరీ అధికారులకు కొత్త స్నైపర్ రైఫిళ్లను బహూకరించారు. ఇటీవల వారం రోజుల పాటు అధికార పార్టీ సంబరాలు నిర్వహించిన నేపథ్యంలో ఆయన ఈ రైఫిళ్లను అందించినట్లు తెలుస్తోంది. మరో వైపు కిమ్ జాంగ్ టీనేజ్ కుమార్తె ఓ షూటింగ్ రేంజ్లో కొత్త తరహా రైఫిళ్లతో కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్థానిక మీడియా రిలీజ్ చేసింది. ఉత్తర కొరియా భవిష్యత్తు నేతగా తన కుమార్తెను కిమ్ తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ పార్టీ, మిలిటరీ అధికారులకు శుక్రవారం కిమ్ రైఫిళ్లను అందజేశారు.గత పార్టీ సమావేశాలు జరిగి అయిదేళ్లు అవుతోందని, తనపై విశ్వాసం చూపించిన వారికి కృతజ్ఞతగా రైఫిళ్లను బహూకరించినట్లు తెలుస్తోంది. కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ పార్టీ సెంట్రల్ కమిటీ జనరల్ అఫైర్స్ డైరెక్టర్గా వ్యవహరించారు. ఆమెకు కీలకమైన పదవి ఇవ్వడంతో.. పార్టీ అంతర్గత వ్యవహారాలతో పాటు పరిపాలనా విభాగంలో ముఖ్య భూమిక పోషించే అవకాశాలు ఉన్నాయి. రైఫిల్ టెస్టింగ్ సమయంలో కిమ్ కుమార్తె కిమ్ జూ యే అక్కడే ఉన్నారు. 13 ఏళ్ల ఆ అమ్మాయి ఇటీవల తండ్రితో కలిసి అనేక కార్యక్రమాలకు హాజరైంది. గత సెప్టెంబర్లో బీజింగ్ ట్రిప్కు కూడా వెళ్లిందామె.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

