న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఉన్న యువత కూడా ఆ టెక్నాలజీలో నిష్ణాతులు కావాలని ప్రభుత్వం ఆశిస్తున్నది. దీని కోసం రాబోయే ఏడాదిలోగా దేశవ్యాప్తంగా సుమారు కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్ నేర్పించనున్నట్లు ప్రధాని మోదీ(PM Modi) తెలిపారు. ఢిల్లీలోని ఎర్రకోట నుంచి ఇవాళ ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. భారత్‌లో ప్రస్తుతం సుమారు రెండున్నర లక్షల స్టార్టప్‌లు ఉన్నాయని, ఇటీవల తమ ప్రభుత్వం ఏఐ ఇంపాక్ట్ సదస్సును నిర్వహించిందని, ఏఐ పరిధి చాలా త్వరగా విస్తరిస్తోందని, ఎర్రకోట నుంచి దేశ యువతకు ఓ ప్రకటన చేస్తున్నానని, రాబోయే సంవత్సర కాలంలో దేశంలోని కోటి మంది యువతకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో నైపుణ్యాన్ని నేర్పించనున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఏఐ ప్రపంచంలో ఆ యువతను బలోపేతం చేయనున్నట్లు చెప్పారు. సప్త ధార విజన్‌లో భాగంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను మూడవ శక్తిగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, స్పేస్, రోబోటిక్స్, డేటా సెంటర్ల రంగం వేగంగా విస్తరిస్తోందని, కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు యువతకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. మేడిన్ ఇండియా 6జీ దేశంలోని ప్రతి మూలకు చేరుకోవాలని, ఇదే తమ లక్ష్యమని మోదీ అన్నారు.
#WATCH | Delhi: From the ramparts of the Red Fort, Prime Minister Narendra Modi says, “Today, there are over 250,000 registered startups. We recently hosted an AI Impact Summit; the reach of AI is expanding rapidly. From the ramparts of the Red Fort, I wish to make an… pic.twitter.com/uHGQZ4Zuwl
— ANI (@ANI) August 15, 2026