న్యూఢిల్లీ : ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న గెజిట్ నోటిఫికేషన్ను పీబీఐ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. అది నిజం కాదని, కేంద్ర ప్రభుత్వం అలాంటి నోటిఫికేషన్ ఇవ్వలేదని తెలిపింది. ఎస్బీఐ సహా మిగతా అన్ని ప్రభుత్వ బ్యాంకులు యథావిధిగా నడుస్తాయని స్పష్టం చేసింది. ఐదు రోజుల పనిదినాలను డిమాండ్ చేస్తూ ఇటీవల బ్యాంకు ఉద్యోగులు మూడు రోజుల సమ్మెను ప్రకటించగా చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అన్ని బ్యాంకులకు ప్రతి శనివారం సెలవు ప్రకటించింది అంటూ ఓ గెజిట్ నోటిఫికేషన్ ప్రచారం అయింది.