న్యూఢిల్లీ : ఏడబ్ల్యూఎస్, గూగుల్ క్లౌడ్ లాంటి సర్వర్లపై ఆధారపడకుండా జోహో సొంతంగా క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించుకుందని జో హో సహ వ్యవస్థాపకుడు శ్రీధర్ వెం బు తెలిపారు. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వర్లెస్ ఫ్లాట్ఫామ్ ద్వారా డెవలపర్లకు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు శ్రీధర్ తెలిపారు. విద్యార్థులకు దీన్ని పూర్తి ఉచితంగా ఇవ్వబోతున్నామని వెల్లడించారు. జోహో ప్రారంభ దశలోనే తన అప్లికేషన్లను నడపడానికి అవసరమైన సొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణాన్ని ప్రారంభించినట్టు తెలిపారు. ఇందులో డేటాబేస్లు, ఐడెంటిటీ మేనేజ్మెంట్, మెసేజింగ్, సెర్చ్, స్టోరేజ్, కంప్యూటింగ్ లాంటి ప్రాథమిక వ్యవస్థలు ఉంటాయని చెప్పారు.