Mammootty | గూగుల్ మ్యాప్ విఫలం.. అర్థరాత్రి 3 గంటలకు మమ్ముట్టికి దారి చూపిన తమిళనాడు వ్యక్తి.. వీడియో
Mammootty | మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టికి తమిళనాడులో ఓ అరుదైన అనుభవం ఎదురైంది. షూటింగ్ ముగించుకుని కేరళకు తిరిగి వస్తున్న సమయంలో దారి తప్పిన ఆయనకు, ఓ సాధారణ యువకుడు దేవుడిలా వచ్చి సహాయం చేశాడు.
Mammootty | మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టికి తమిళనాడులో ఓ అరుదైన అనుభవం ఎదురైంది. షూటింగ్ ముగించుకుని కేరళకు తిరిగి వస్తున్న సమయంలో దారి తప్పిన ఆయనకు, ఓ సాధారణ యువకుడు దేవుడిలా వచ్చి సహాయం చేశాడు. ఈ హృద్యమైన సంఘటనను ప్రముఖ నిర్మాత ఆంటో జోసెఫ్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
అసలేం జరిగిందంటే..?
మమ్ముట్టి కంపెనీ నిర్మాణంలో, నితీష్ సహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా షూటింగ్ కారైకుడిలో జరుగుతోంది. ఈ షూటింగ్ పూర్తి చేసుకుని మమ్ముట్టి, ఆంటో జోసెఫ్, నటుడు రమేష్ పిషారడి, డ్రైవర్ ఉన్నిలతో కలిసి కారులో కేరళకు బయలుదేరారు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో తిరుపత్తూరు సమీపంలో హైవే బ్లాక్ చేయడంతో వారి ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. అయితే గూగుల్ మ్యాప్ సహాయంతో దారి వెతికినప్పటికీ, పదేపదే అదే దారికి చేరడంతో సుమారు గంటపాటు వారు తీవ్ర ఇబ్బంది పడ్డారు. పరిస్థితి అర్థం కాక విసిగిపోయిన మమ్ముట్టి, “తిరిగి కారైకుడిలోని రూమ్‌కు వెళ్దాం, ఉదయం రోడ్లు తెరుచుకుంటాయి” అని అనడంతో డ్రైవర్ కారు వెనక్కి తిప్పడానికి సిద్ధమయ్యాడు.
అయితే దారిలో పట్టమంగళం వద్ద ఒక పెట్రోల్ బంక్ కనిపించగా, అక్కడ కొండుగుల తెరలో పడుకుని ఉన్న కొందరు యువకులను మమ్ముట్టి డ్రైవర్ సంప్రదించాడు. అయితే అందులో ఒకరైన ‘పాండియన్’ అనే యువకుడు కారులో కూర్చున్నది మమ్మూట్టి అని గుర్తించి. వెంటనే అతడి వద్దకి వచ్చి “నీంగల్ మమ్ముట్టి సారా” (మీరు మమ్మూటి సారా) అని వారి సమస్యను తెలుసుకుని నేను దారి చూపిస్తా నన్ను ఫాలో అవ్వండి అంటూ తన బైక్ స్టార్ట్ చేశాడు. గూగుల్‌కు కూడా సరిగ్గా తెలియని దారుల్లో, తెల్లవారుజామున సుమారు 10 కిలోమీటర్ల దూరం ఆ యువకుడు తన బైక్‌పై వారికి ముందుండి దారి చూపించాడు. సరైన మార్గంలో చేర్చిన తర్వాత, ఇలాగే స్ట్రెయిట్‌గా వెళ్తే కేరళ దారి వస్తుంది అని చెప్పి వీడ్కోలు పలికాడు.
అయితే పాండియన్ చేసిన సహయంకి వెంటనే కారు దిగిన మమ్మూటి, ఆ యువకుడిని ఆప్యాయంగా హత్తుకుని ఫోన్ తీసుకుని సెల్ఫీ దిగారు. ‘నీ పేరేంటి?’ అని ఆప్యాయంగా పేరు అడిగి తెలుసుకున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
#Mammootty #Kerala #Karaikudi #CinemaShooting #Travel #TrendingVideo #Malayalam #Kollywood #Trending #Video pic.twitter.com/kC2iXksOxp
— Actor Kayal Devaraj (@kayaldevaraj) August 14, 2026
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Non Veg | నాన్‌వెజ్ తినే మహిళలు వందేళ్లు బతుకుతారంట.. సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడి
Farmers | పంటలు ఎండిపోతున్నా పట్టింపు లేదా.. అన్నదాతల ఆగ్రహం
Gang Rape | మహిళపైనా ‘గ్యాంగ్ రేప్’ కేసు పెట్టొచ్చు.. ఢిల్లీ హైకోర్టు చరిత్రాత్మక తీర్పు
Cyber Crime | సైబర్ నేరాలకు కాంగ్రెస్ నేత మ్యూల్ ఖాతా!.. ప్రధాన నిందితుడు వెంకటేశ్ సహా నలుగురి అరెస్టు
YTPS | వైటీపీఎస్‌లో సీఈపై సస్పెన్షన్ వేటు.. రద్దు చేయాలని ఉద్యోగుల జేఏసీ వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

