Family Thrown Into Canal | ఆరుగురిని కాలువలో తోసివేత.. ముగ్గురు మృతి, ప్రాణాలతో బయటపడిన బాలుడు
Family Thrown Into Canal | ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు కారులో ప్రయాణించారు. కొందరు వ్యక్తులు మరో వాహనంలో వారిని అనుసరించారు. ఒకచోట ఆ కుటుంబాన్ని అడ్డుకున్నారు. భార్యాభర్తలు, పిల్లలను కాలువలోకి తోసేశారు. ముగ్గురు మరణించగా ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు.
గాంధీనగర్: ఒక కుటుంబానికి చెందిన ఆరుగురు కారులో ప్రయాణించారు. కొందరు వ్యక్తులు మరో వాహనంలో వారిని అనుసరించారు. ఒకచోట ఆ కుటుంబాన్ని అడ్డుకున్నారు. భార్యాభర్తలు, పిల్లలను కాలువలోకి తోసేశారు. ముగ్గురు మరణించగా ఇద్దరు పిల్లలు గల్లంతయ్యారు. ఒక బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. (Family Thrown Into Canal) మహారాష్ట్రలోని జల్గావ్కు చెందిన ఒక కుటుంబంలోని ఆరుగురు ఒక పని నిమిత్తం గుజరాత్‌లోని సూరత్‌కు కారులో ప్రయాణమయ్యారు. నలుగురు వ్యక్తులు మరో వాహనంలో వారిని అనుసరించారు.
కాగా, నవంబర్ 21న రాత్రి వేళ గుజరాత్‌లోని బార్డోలి తాలూకా ఉవా గ్రామం సమీపంలో మరో వాహనంలోని వ్యక్తులు ఆ కుటుంబం ఉన్న కారును అడ్డుకున్నారు. ఆ ఆరుగురిని ఒక కాలువలోకి తోసేశారు. అయితే మహువా సమీపంలోని కాలువలో దంపతులతో సహా ముగ్గురి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. నితిన్ అలియాస్ భురియా పాటిల్, ఆయన భార్య కవిత, 9 ఏళ్ల కుమార్తెగా మృతులను గుర్తించారు. రెండేళ్ల చిన్నారి, 16 ఏళ్ల బాలుడు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
మరోవైపు ఆ కుటుంబానికి చెందిన 13 ఏళ్ల బాలుడు ఒక్కడే ప్రాణాలతో బయపట్టాడు. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నాడు. ఆదివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన విషయం చెప్పాడు. మహారాష్ట్రలోని ఇంట్లో ఉన్న అతడి పెద్ద సోదరికి పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను గుర్తించామని, వారిని అరెస్ట్ చేసేందుకు ఆరు పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Family Thrown Into Canal | ఆరుగురిని కాలువలో తోసివేత.. ముగ్గురు మృతి, ప్రాణాలతో బయటపడిన బాలుడు
Road accident | గద్వాలలో రోడ్డు ప్రమాదం..చెట్టును ఢీకొని యువకుడు మృతి
వేపలగడ్డ పంచాయతీ భవనం ప్రారంభం
‘బూర్గంపహాడ్- ఇరవెండి రహదారి నిర్మాణం చేపట్టాలి’
Nagurla Venkateshwarlu | దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి : నాగుర్ల వెంకటేశ్వర్లు
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

