Iran attacks : ఒకవైపు ఇరాన్ (Iran) పై అమెరికా-ఇజ్రాయెల్ (US-Israel) దాడులు కొనసాగుతుండగానే.. ఇజ్రాయెల్ ప్రతీకార దాడులకు పాల్పడుతోంది. ముఖ్యంగా పరిసర దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తోంది. రెండు రోజుల క్రితం అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేసింది మొదలు ఇప్పటిదాకా ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగుతున్నాయి. ఆదివారం సాయంత్రం మరోసారి మధ్యప్రాచ్య దేశాలైన దుబాయ్, అబుదాబి, దోహా, మనామా దేశాలపై ఇరాన్ మిస్సైల్స్ వర్షం కురిపించింది.
ఇరాన్ దాడులతో దుబాయ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ శబ్దాలు వినిపించాయి. అబుదాబిలో కూడా పెద్దపెద్ద పేలుళ్లు సంభవించాయి. మనామాలో సైరన్ల మోత మోగింది. ఖతార్ రాజధానిలో కూడా భారీ పేలుడు సంభవించింది. గత రెండు రోజుల నుంచి వరుసగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది.