SA vs ZIM : సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన జింబాబ్వే గొప్పగా పోరాడుతోంది. అజేయంగా గ్రూప్ ఏ నుంచి సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన దక్షిణాఫ్రికాను చెమటోడ్చేలా చేస్తోంది. స్వల్ప ఛేదనలో సఫారీ బ్యాటర్లను జింబాబ్వే బౌలర్లు ముప్పతిప్పలు పెడుతున్నారు. బ్యాటుతో మెరిసిన సికిందర్ రజా(3-29) బంతితోనూ తిప్పేస్తుండగా.. ప్రొటీస్ జట్టు సగం వికెట్లు కోల్పోయింది. డేంజరస్ డెవాల్డ్ బ్రెవిస్(41) ఔటవ్వడంతో సఫారీ జట్టు హిట్టర్లు ఆచితూచి ఆడుతున్నారు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఓపెనర్ క్వింటన్ డికాక్(0)ను వెనక్కి పంపిన సికిందర్ రజా(3-29) వికెట్ల వేట కొనసాగిస్తున్నాడు. స్లో డెలివరీతో ఎడెన్ మర్క్రమ్(4)ను బౌల్డ్ చేసిన జింబాబ్వే సారథి.. సఫారీ హిట్టర్లను నిలువరిస్తున్నాడు. 43కే మూడు వికెట్లు పడినా.. డెవిడ్ మిల్లర్(22), డెవాల్డ్ బ్రెవిస్(41)లు దూకుడైన ఆటతో జింబాబ్వే బౌలర్లను హడలెత్తించారు. మిల్లర్‌ను ముజరబని బోల్తా కొట్టించగా.. సిక్సర్లతో చెలరేగుతున్న బ్రెవిస్‌ను రజా పెవిలియన్ చేర్చాడు. దాంతో.. 101 వద్ద దక్షిణాఫ్రికా ఐదో వికెట్ కోల్పోయింది.
Sikandar Raza is unstoppable 👊
The Zimbabwe skipper goes through his opposite number Aiden Markram with a peach!#T20WorldCup broadcast details ➡️ https://t.co/NPykWM7qqY pic.twitter.com/EmK1ACNPSX
— ICC (@ICC) March 1, 2026