అహద్మాబాద్: మొబైల్ ఫోన్ కొనేందుకు భర్త నిరాకరించాడు. దీంతో భార్య ఆగ్రహం చెందింది. ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Woman Dies By Suicide) గుజరాత్‌లోని అరవల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. నేపాల్‌కు చెందిన 22 ఏళ్ల ఊర్మిళ ఖానన్ రిజన్ తన భర్త, బిడ్డతో కలిసి మోడసాలో నివసిస్తున్నది. ఈ దంపతులు ఆ ప్రాంతంలో చైనీస్ ఫుడ్ వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
కాగా, ఊర్మిళ తన భర్తను కొత్త మొబైల్ ఫోన్ కొనివ్వమని చాలా కాలంగా అడుగుతున్నది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతడు పదేపదే నిరాకరించాడు. ఈ విషయంపై దంపతుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
మరోవైపు భర్తతో గొడవ తర్వాత ఊర్మిళ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు అక్కడకు చేరుకున్నారు. నేపాల్ మహిళ అయిన ఊర్మిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:
2 wives man kills live-in partner | ఇద్దరు భార్యలున్న వ్యక్తి.. సహజీవనం చేస్తున్న మహిళను హత్య
Newlywed Woman’s Body | నూతన వధువు మృతదేహాన్ని.. తల్లిదండ్రుల ఇంటి బయట వదిలివేశారు
Watch: మంచు కారణంగా ఎక్స్‌ప్రెస్‌వేపై వాహనాలు ఢీ.. మంటల్లో ఇద్దరు సజీవ దహనం