Virosh | మరి కొద్ది నిమిషాలలో విజయ్-రష్మికల పెళ్లి.. ఫుడ్ మెనూ చాలా పెద్దదే..!
Virosh | టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా అట్టహాసంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన అత్యంత సన్నిహితులు, దర్శకులు, స్నేహితులు ఇప్పటికే అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు.
Virosh | టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా అట్టహాసంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ పరిశ్రమకు చెందిన అత్యంత సన్నిహితులు, దర్శకులు, స్నేహితులు ఇప్పటికే అక్కడికి చేరుకుని సందడి చేస్తున్నారు. తరుణ్ భాస్కర్, శివ నిర్వాణ, వంశీ పైడిపల్లి, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో పాటు రాహుల్ రవీంద్రన్, ఆషికా రంగనాథ్ తదితర ప్రముఖులు వేడుకల్లో పాల్గొన్నారు. డ్యాన్స్‌లు, ప్రత్యేక ప్రదర్శనలతో ప్రీ వెడ్డింగ్ వేడుకలు గ్రాండ్‌గా కొనసాగాయి.
ఫిబ్రవరి 26 ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య సుముహూర్తంలో హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరగనుంది. వేదమంత్రాల నడుమ పట్టు వస్త్రాల్లో విజయ్–రష్మికల జంట పెళ్లి తంతు పూర్తిచేయనుంది. అచ్చమైన తెలుగింటి సంప్రదాయ పద్ధతిలో ఉదయం వివాహం జరిపేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. అదే రోజు సాయంత్రం రష్మిక సొంత సంప్రదాయం అయిన ‘కొడవ’ (కూర్గ్) ఆచారం ప్రకారం మరోసారి పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. కూర్గ్ ప్రత్యేక దుస్తులు, ఆచారాలతో ఈ కార్యక్రమాన్ని అందంగా డిజైన్ చేశారు. రెండు కుటుంబాల సంప్రదాయాలకు గౌరవం ఇస్తూ ప్లాన్ చేసిన ఈ డబుల్ వెడ్డింగ్ టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్‌లోని ఐటీసీ మెమంటోస్ ఉదయ్‌పూర్‌లో జరుగుతోంది. ఉదయ్‌పూర్‌కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లగ్జరీ రిసార్ట్‌లో అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఒక్కో గది నైట్ రెంట్ రూ.20 వేల నుంచి రూ.70 వేల వరకు ఉందని సమాచారం. ప్రైవేట్ హెలిప్యాడ్ సౌకర్యం ఉన్న ఈ రిసార్ట్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రముఖులు మాత్రమే హాజరుకానుండటంతో ఉదయ్‌పూర్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు. రాయల్ వెడ్డింగ్‌కు తగ్గట్టే ఫుడ్ మెనూ కూడా గ్రాండ్‌గా సిద్ధమైంది. తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, చికెన్ వంటకాలతో పాటు కర్ణాటక ప్రత్యేక బిసిబేళా బాత్, కూర్గ్ స్టైల్ పోర్క్ కర్రీ వంటి వంటకాలతో అతిథులకు ప్రత్యేక విందు ఇవ్వనున్నారు. కొడవ సంప్రదాయం ప్రకారం పోర్క్ కర్రీకి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు.
ప్రీ-వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో ‘VIROSH’ అనే ఎంబ్రాయిడరీతో ప్రత్యేక డెకరేషన్ చేయడం కూడా ఆకట్టుకుంది. ప్రతి చిన్న విషయంలోనూ ఈ జంట ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. వివాహానంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- love
- menu
- rashmika
- rowdy janardhan
RELATED ARTICLES
తాజా వార్తలు
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
Rajinikanth | గ్రీస్‌లో అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్యల వివాహం.. కొత్త జంటతో రజనీకాంత్ డ్యాన్స్!
Bigg Boss 10 | డబుల్ ఎమోషనల్ సర్ప్రైజ్.. ముకేశ్‌కు తల్లి ప్రేమ,శివకుమార్‌కు ప్రియాంకతో ఎంగేజ్మెంట్!
ఆలయ ప్రాంగణంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. రూ.13,200 నగదు స్వాధీనం
Priya Bhavani Shankar | ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్.. క్యూట్ పిక్స్ షేర్ చేసిన ప్రియా భవాని
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

