హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీ గోల్ఫ్ ఫౌండేషన్ నిర్వహించిన హైదరాబాద్ అమెచ్యూర్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో అమూల్య విజేతగా నిలిచింది. గచ్చిబౌలి బౌల్డర్‌హిల్స్ వేదికగా శనివారం ముగిసిన 18 హోల్ టోర్నీలో అమూల్య 148 స్కోరుతో అగ్రస్థానంలో నిలిచి ట్రోఫీ కైవసం చేసుకుంది.
విజేతగా నిలిచిన అమూల్యకు రూ.90వేల ప్రైజ్‌మనీ దక్కగా, శ్వేత గుల్లపల్లి(151), అభిషేక్ మిత్రా (152) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. టోర్నీ ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ హాజరై విజేతలకు ట్రోఫీలు అందజేశారు.