Cheyutha Pensions | సర్కారు చేయూతకు కొర్రీల వాత.. ఏడు వర్గాలకే కొత్త పింఛన్లు.. వృద్ధాప్య పింఛన్ల ఊసే లేదు!
Cheyutha Pensions | కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్.. పింఛన్ల మంజూరు విషయంలో అనేక కొర్రీలు తెరపైకి తీసుకొస్తున్నది. ముఖ్యం గా వృద్ధాప్య పింఛన్ల ప్రస్తావన లేకుండానే కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం జారీచేసిన సర్యులర్ వి మర్శలకు తావిస్తున్నది.
Cheyutha Pensions | హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): కొత్త చేయూత పింఛన్లకు దరఖాస్తు చేసుకోవాలని చెప్తున్న కాంగ్రెస్ సర్కార్.. పింఛన్ల మంజూరు విషయంలో అనేక కొర్రీలు తెరపైకి తీసుకొస్తున్నది. ముఖ్యం గా వృద్ధాప్య పింఛన్ల ప్రస్తావన లేకుండానే కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం జారీచేసిన సర్యులర్ వి మర్శలకు తావిస్తున్నది. తొలి దశలో కొత్త పింఛన్లను ఏడు క్యాటగిరీలకు మం జూరు చేయాలని సర్యులర్లో సెర్ప్ పేరొన్నది. ఒంటరి మహిళలు, వితంతువులు, ది వ్యాంగులు, గీత కార్మికులు, చేనేత కార్మికు లు, ఫైలేరియా బాధితులు, తలసేమియా, సికిల్సెల్ డిసీజ్, హీమోఫీలియా వంటి రక్త సంబంధిత వైకల్యాలతో బాధపడుతున్న వారికి అవకాశం కల్పించింది. అంటే ‘అందరికీ చేయూత’ అనే విస్తృత హామీకి బదులు.. తొలి దశలో ఎంపిక చేసిన వర్గాలకే కొత్త పింఛన్లు అన్నట్టుగా మార్గదర్శకాలు ఉన్నాయి.
వృద్ధాప్య పింఛన్ ఎక్కడ?
కొత్త పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం విడుదల చేసిన సర్యులర్లో వృద్ధాప్య పింఛన్ల క్యాటగిరీ కనిపించకపోవడం ప్రధాన ప్రశ్నగా మారింది. ఇప్పటికే రాష్ట్రం లో నాలుగు లక్షలకుపైగా వృద్ధాప్య పింఛన్ల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొత్త మార్గదర్శకాల్లో ఆ వర్గానికి చోటు లేకపోవడం ప్రభుత్వ ఉద్దేశంపై అనుమానాలు రేకెత్తిస్తున్నది. కాగా, ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిందని ప్రతిపక్షాలు, లబ్ధిదారులు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు విడుదలైన మార్గదర్శకాల్లో వృద్ధాప్య పింఛన్లపై స్పష్టత లేకపోవడం మాట మార్చడమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
వితంతువుకు భర్త మరణ ధ్రువీకరణ తప్పనిసరి
వితంతువులకు భర్త మరణ ధ్రువీకరణ పత్రం, ఒంటరి మహిళలకు సెపరేషన్/లోకల్ ఎంక్వైరీ రిపోర్ట్, గీత కార్మికులకు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ధ్రువీకరణ, చేనేత కార్మికులకు హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ శాఖ సర్టిఫికేషన్, ఫైలేరియా బాధితులకు వైద్య ఆరోగ్య శాఖ సర్టిఫికెట్ వంటి ధ్రువీకరణ పత్రాలు అవసరమని సర్యులర్లో పేర్కొన్నారు? దీంతో అర్హత ఉన్నా పత్రాలు సమర్పించలేని వారు పింఛన్కు దూరమయ్యే ప్రమాదం ఉన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే, కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులను ఆగస్టు 31 వరకు స్వీకరించాలని ప్రభుత్వం గడువు విధించింది. ఈ స్వల్ప కాలపరిమితిలో పత్రాల సేకరణ, సమర్పణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

