‘ఆయుర్వేదంతో మొండి వ్యాధులు నయం’
ప్రాచీన కాలం నుండి అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలంగా బాధిస్తున్న మొండి వ్యాధులు పూర్తిగా తొలిగిపోతాయని కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాల వైద్యాధికారిణి గుమ్మడి అరుణ అన్నారు. మంగళవారం మండలంలోని సమతభట్టుపల్లి పంచాయతీలో...
కరకగూడెం, సెప్టెంబర్ 22 : ప్రాచీన కాలం నుండి అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యంతో దీర్ఘకాలంగా బాధిస్తున్న మొండి వ్యాధులు పూర్తిగా తొలిగిపోతాయని కరకగూడెం ప్రభుత్వ ఆయుర్వేదిక్ వైద్యశాల వైద్యాధికారిణి గుమ్మడి అరుణ అన్నారు. మంగళవారం మండలంలోని సమతభట్టుపల్లి పంచాయతీలో జాతీయ ఆయుర్వేద దినోత్సవాన్ని పురస్కరించుకుని వైద్య శిబిరాన్ని నిర్వహించారు. పలు రకాల వ్యాధులతో బాధపడుతున్న గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఆయుర్వేద మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆధునిక వైద్యంలో కేవలం లక్షణాలను అణచివేసే చికిత్సలు ఎక్కువగా ఉంటాయని, కానీ ఆయుర్వేదంలో వ్యాధి మూలాలను గుర్తించి శరీరాన్ని శాశ్వతంగా ఆరోగ్యవంతం చేయడానికి మందులు ఎంతో సహకరిస్తాయని వివరించారు. అన్ని రకాల మందులు ఆయుర్వేద ఆస్పత్రిలో అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమరం సత్యనారాయణ, పంచాయతీ కార్యదర్శి సమ్మయ్య, వైద్య సిబ్బంది రాధిక, నాగేష్ పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Konda Surekha | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పర్యవేక్షణకు మాజీ మంత్రి కొండా సురేఖ దూరం
Harish Rao | ఎల్నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

