Iran Offer | అగ్రరాజ్యం అమెరికాకు ఇరాన్ కీలక ప్రతిపాదన.. దెబ్బకు దిగొచ్చిన చమురు ధరలు..!
Iran Offer | పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా (USA) కు ఇరాన్ (Iran) కీలక ప్రతిపాదన చేసింది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని తెరిచేందుకు సిద్ధమని తెలిపింది. ఈ విషయాన్ని ఓ సీనియర్ ఇరాన్ అధికారి వెల్లడించినట్లు రాయిటర్స్ (Roiters) తెలిపింది.
Iran Offer : పశ్చిమాసియా (West Asia) లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అగ్రరాజ్యం అమెరికా (USA) కు ఇరాన్ (Iran) కీలక ప్రతిపాదన చేసింది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి దిగ్బంధనాన్ని ఎత్తివేస్తే ఏడు రోజుల్లో హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) ని తెరిచేందుకు సిద్ధమని తెలిపింది. ఈ విషయాన్ని ఓ సీనియర్ ఇరాన్ అధికారి వెల్లడించినట్లు రాయిటర్స్ (Roiters) తెలిపింది. మధ్యవర్తుల ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు చేరవేసినట్లు తెలుస్తోంది.
అమెరికాతో చర్చలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఈ ప్రతిపాదనతో ఇరాన్ సంకేతాచ్చింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా న్యూయార్క్లో మధ్యవర్తి దేశాలతో ఈ అంశంపై చర్చించాలని టెహ్రాన్ భావిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ ఉండబోదని ఇరాన్ అధికారి తెలిపారు. అయితే అమెరికా నిబద్ధత చూపితే ఒప్పందం దిశగా వెళ్లే అవకాశం ఉందన్నారు.
హర్మూజ్ జలసంధికి సంబంధించిన సైనిక చర్యలను అమెరికా నిలిపివేయాలని ఇరాన్ కోరుతోంది. అమెరికా సైనిక ఒత్తిడిని తగ్గించి, ఇరాన్ పోర్టులపై ఆంక్షలు ఎత్తివేస్తే జలసంధిని తిరిగి తెరిచి చర్చలను కొనసాగిస్తామని టెహ్రాన్ చెబుతోంది. పోర్టులపై ఆంక్షలు ఇరాన్ ముడిచమురు ఎగుమతులు, సముద్ర రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. చర్చలను పునరుద్ధరించేందుకు ఇరాన్ గతంలో ఏడు షరతులను కూడా వెల్లడించింది.
హర్మూజ్ జలసంధి త్వరలో తెరుచుకునే అవకాశం ఉందన్న వార్తలతో అంతర్జాతీయ చమురు ధరలు తగ్గాయి. బ్యారెల్ చమురు ధర 99 డాలర్ల దిగువకు పడిపోయింది. బ్రెంట్ క్రూడ్ ధర సెషన్ గరిష్ఠస్థాయి నుంచి 3.5 శాతానికిపైగా తగ్గగా వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ 2.25 శాతం పడిపోయింది. హర్మూజ్ ద్వారా ముడిచమురు సరఫరాలో అంతరాయాలపై ఆందోళనలు తగ్గడంతో ధరలు దిగివచ్చాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

