Pension | బతికుండగానే రికార్డుల్లో చంపేశారు.. మూడు నెలలుగా పింఛన్‌రాక దివ్యాంగుడి అవస్థ!
Pension | బతికున్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మరణించినట్టు నమోదు కావడంతో ఓ దివ్యాంగుడి ఆసరా పింఛన్ మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో వెలుగుచూసింది.
Pension | శంకరపట్నం, ఆగస్టు 11 : బతికున్న వ్యక్తిని ప్రభుత్వ రికార్డుల్లో మరణించినట్టు నమోదు కావడంతో ఓ దివ్యాంగుడి ఆసరా పింఛన్ మూడు నెలలుగా నిలిచిపోయింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మెట్పల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన తోట శ్రీనివాస్‌కు మూడు నెలలుగా పింఛన్ రాకపోవడంతో సంబంధిత కార్యాలయాన్ని సంప్రదించాడు. అయితే రికార్డుల్లో తన పేరు ‘డెత్’గా నమోదైనట్టు గుర్తించాడు. దీనిపై ఎంపీడీవో స్పందిస్తూ తమ సిబ్బంది పింఛన్‌ను తొలగించలేదని తెలిపారు.
గ్రామ పంచాయతీ కార్యదర్శిని విచారించగా, తన లాగిన్ నుంచి కూడా మరణించినట్టు నమోదు చేయలేదని, మే నెలలో లైవ్ అథెంటిఫికేషన్ కోసం ప్రయత్నించిన సమయంలోనే సిస్టమ్‌లో ‘డన్’గా చూపించిందని వివరించినట్టు పేర్కొన్నారు. ఇది సాంకేతిక లోపమా? ఇతర కారణాల వల్ల జరిగిందా? అనే అంశంపై జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఎంపీడీవో అనిత తెలిపారు. రికార్డును సరిచేసి శ్రీనివాస్ స్టేటస్‌ను తిరిగి ‘లైవ్’లోకి తీసుకువచ్చి పింఛన్‌ను పునరుద్ధరించాలని కోరుతూ మంగళవారం ఉన్నతాధికారులకు లేఖ పంపినట్టు వెల్లడించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

