నాంపల్లి, సెప్టెంబర్ 16 : తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి గిరిజనులను అభివృద్ధి పథంలో, ప్రజా ప్రతినిధులుగా చేసింది కేసీఆర్ అని బీఆర్ఎస్ నాంపల్లి మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు సభావాత్ సర్దార్ నాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో మాట్లాడుతూ.. ఎస్టీలకు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను 10 శాతానికి పెంచి అధిక శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించిన కేసీఆర్ కి గిరిజన సమాజమంతా రుణపడి ఉంటుందన్నారు. ఆయనకు కృతజ్ఞతగా రేపు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పిలుపుమేరకు అన్ని తండాలలో కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకంతో పాటు భారీగా ర్యాలీ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు.