Bathukamma Celebrations | తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (ETCA) ఆధ్వర్యంలో దుబాయ్‌లో ఘనంగా నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు దుబాయ్‌లో నిర్వహించనున్న బతుకమ్మ వేడుకల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
దుబాయిలో బతుకమ్మ వేడుకలకు హాజరు కావాలని ETCA ప్రతినిధులు గత నెలలో కేటీఆర్‌ను కలిసి ఆహ్వానించారు. వారి ఆహ్వానం మేరకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు దుబాయి వెళ్లి బతుకమ్మ వేడుకల్లో పాల్గొనాలని కేటిఆర్ సూచించారు. అక్టోబర్ 11, ఆదివారం దుబాయ్‌లోని శబాబ్ అల్ అహ్లీ స్పోర్ట్స్ క్లబ్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరగనున్న ఈ బతుకమ్మ వేడుకల్లో బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం పాల్గొననుంది.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మను విదేశీ గడ్డపై, ఎడారి దేశంలో వైభవంగా నిర్వహించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ , ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సురేందర్ , మాజీ ఎమ్మెల్యే బోధన్ షకీల్ అహ్మద్ హాజరుకానున్నారు.
కరెంటు ఇవ్వకుండా రైతులను గోస పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం : సుంకె రవిశంకర్
Kushitha Kallapu | నిషా కళ్లతో మత్తెక్కిస్తున్న కుషిత.. రెడ్ శారీలో అదిరిపోయే లుక్!
Dhurandhar The Revenge | థియేటర్లలో దుమ్మురేపిన ‘ధురంధర్’.. టీవీలో ఎప్పుడు ప్రసారం కానుంది అంటే..!