Dhurandhar The Revenge | థియేటర్లలో దుమ్మురేపిన ‘ధురంధర్’.. టీవీలో ఎప్పుడు ప్రసారం కానుంది అంటే..!
Dhurandhar The Revenge | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచి, థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులతో పాటు మరోసారి చూడాలనుకునే అభిమానులకు టెలివిజన్ ప్రీమియర్ ద్వారా వినోదం అందించనుంది.
Dhurandhar The Revenge | బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ‘ధురంధర్: ది రివెంజ్’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. హిందీ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచి, థియేటర్లలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. థియేటర్లలో సినిమాను మిస్ అయిన ప్రేక్షకులతో పాటు మరోసారి చూడాలనుకునే అభిమానులకు టెలివిజన్ ప్రీమియర్ ద్వారా వినోదం అందించనుంది. ‘ధురంధర్: ది రివెంజ్’ టెలివిజన్ ప్రీమియర్ తేదీ, సమయం ఖరారయ్యాయి. అక్టోబర్ 18, ఆదివారం సాయంత్రం 7 గంటలకు స్టార్ గోల్డ్ ఛానెల్లో ఈ సినిమా ప్రసారం కానుంది. భారీ స్థాయిలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను కుటుంబ ప్రేక్షకులు టీవీపై వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.
థియేటర్లలో విడుదలైన సమయంలోనే సినిమాకు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించింది. యాక్షన్ సన్నివేశాలు, కథనం, రణ్వీర్ సింగ్ నటనకు మంచి ఆదరణ దక్కింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించడంతో ఈ చిత్రం హిందీ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘ధురంధర్: ది రివెంజ్’కు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో కనిపించారు. ఆయనకు తోడుగా అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్, సారా అర్జున్, రాకేశ్ బేడీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
సినిమాలో యాక్షన్‌కు పెద్దపీట వేయడంతో పాటు ఉత్కంఠభరితమైన కథనం ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు. ముఖ్యంగా రణ్వీర్ సింగ్ తన పాత్రలో చూపించిన నటన, బాడీ లాంగ్వేజ్ , యాక్షన్ సన్నివేశాల్లో ఆయన ప్రదర్శన సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాలు టెలివిజన్‌లోకి వచ్చినప్పుడు వాటి టీఆర్పీలపై ఆసక్తి నెలకొంటుంది. ముఖ్యంగా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సినిమాలకు బుల్లితెరపై కూడా భారీ స్పందన లభించే అవకాశం ఉంటుంది. ‘ధురంధర్: ది రివెంజ్’ విషయంలోనూ ఇప్పుడు ఇదే ఆసక్తి కనిపిస్తోంది. థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించిన ఈ చిత్రం టీవీ ప్రీమియర్‌లో ఎలాంటి టీఆర్పీ నమోదు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఆదివారం సాయంత్రం ప్రైమ్ టైమ్‌లో ప్రసారం కానుండటంతో భారీ సంఖ్యలో ప్రేక్షకులు సినిమాను వీక్షించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నంబర్ ప్లేట్లు.. నిబంధనలకు తూట్లు!.. బాస్, ఐగాడ్, 1, 3, 9తో నంబర్ ప్లేట్లు
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

