Upadi hami works | సర్పంచ్ ఫిర్యాదు.. ఉపాధిహామీ పనుల బిల్లులపై విచారణ
Upadi Hami Works | ఇటీవల అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ శశికాంత్ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు రాలేదని, దీనిపై విచారణ జరిపించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.
Upadi hami works | రాయపోల్, సెప్టెంబర్ 16 : ఉపాధి హామీ పనుల్లో అక్రమాలు జరిగితే సహించే ప్రసక్తి లేదని సిద్దిపేట జిల్లా అడిషనల్ రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
బుధవారం రాయపోల్ మండల పరిషత్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఇటీవల అంకిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ శశికాంత్ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు బిల్లులు రాలేదని, దీనిపై విచారణ జరిపించాలని గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై ఉన్నతాధికారుల సూచనల మేరకు అడిషనల్ ఏపీడీ ఆనంద మేరీతో కలిసి ఎంపీడీవో కార్యాలయంలో విచారణ జరిపి వివరాలను పరిశీలించారు.
సంబంధిత అధికారులు ఆయా గ్రామాల సర్పంచుల నుంచి వివరాలను సేకరించారు. సేకరించిన సమాచారాన్ని జిల్లా కలెక్టర్‌కు అందజేస్తామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు ఉంటాయని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఏపీవో జనార్ధన్, సర్పంచ్, సీనియర్ నాయకుడు ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.

Read Also :
‘భక్తిశ్రద్ధలు, సోదరభావంతో గణేష్ ఉత్సవాలను నిర్వహించాలి’
TN CM Vijay | లండన్‌లో తమిళనాడు సీఎం విజయ్ ఈవెంట్ రద్దు.. అభిమానులకు నిరాశ..!
Jobs Notification | ఏపీలో 2,050 ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Read Today's Latest Medak Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

